Advertisementt

కార్తికేయ ‘90ML’ ఏసుకుని వస్తున్నాడు

Thu 05th Dec 2019 07:44 PM
karthikeya,90ml movie,ready to release,hero karthikeya,90ml movie release update  కార్తికేయ ‘90ML’ ఏసుకుని వస్తున్నాడు
Karthikeya 90ML Movie Ready to Release కార్తికేయ ‘90ML’ ఏసుకుని వస్తున్నాడు
Advertisement
Ads by CJ

హీరో కార్తికేయకి ‘RX100’ వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై కొత్త దర్శకుడు శేఖ‌ర్ రెడ్డి యర్రతో నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన ‘90ML’ని ఈ నెల 6న విడుదల చేయనున్నారు. నేహా సోలంకిని హీరోయిన్‌గా తెలుగు పరిశ్రమకి పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన పాటలకి, ప్రమోషనల్ టూర్లకి మరియు ప్రీ రిలీజ్ ఈవెంటుకి అనూహ్య స్పందన వచ్చిందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

ఇక కథ విషయానికి వస్తే ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు ‘దేవ‌దాస్‌’, ఎంబీఏ గోల్డ్ మెడ‌లిస్ట్. అంత‌టి విద్యావంతుడు ‘ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌’గా ఎందుకు అయ్యాడన్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. యూత్‌కి కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు, కార్తికేయ డాన్సులు, డైలాగులు, ఫైట్స్ ట్రైలర్‌లో కనిపించడంతో ప్రేక్షకుల్లో చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ థియేట్రిక‌ల్ రైట్స్‌ని శ్రీ వైష్ణ‌వి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఫ్యాన్సీ ఆఫ‌ర్‌కి సొంతం చేసుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సర్టిఫికెట్ లభించింది. 

ఈ సందర్భంగా నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ.. ‘‘90MLని మొదట డిసెంబరు 5న విడుదల చేద్దాం అనుకున్నాము కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 6కి మార్చుకున్నాం. పూర్తిగా కొత్త కథకథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కమర్షియల్, ఎంటర్టైనింగ్ మరియు ఎమోషనల్ అంశాలతో రాబోతుంది. మా బ్యానర్‌కి పేరు తెచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘RX100’ని మించిన హిట్ అవుతుందని మా ప్రగాఢ నమ్మకం’’ అని చెప్పారు.

పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, కెమెరా: జె.యువ‌రాజ్‌, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, ఆర్ట్: జీఎం శేఖ‌ర్‌, ఫైట్స్: వెంక‌ట్‌.

Karthikeya 90ML Movie Ready to Release:

Karthikeya 90ML Movie Censor Completed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ