Advertisementt

బాలయ్య ‘రూలర్’‌ను చుట్టేశారుగా..!

Thu 05th Dec 2019 11:29 AM
ruler movie,balakrishna,sai tej,venky mama,release,threat  బాలయ్య ‘రూలర్’‌ను చుట్టేశారుగా..!
Ruler Cornered by Venky Mama and Prati Roju Pandaage బాలయ్య ‘రూలర్’‌ను చుట్టేశారుగా..!
Advertisement
Ads by CJ

కథానాయకుడు, మహానాయకుడు సినిమాల దెబ్బతో ఉన్న బాలకృష్ణకి మరో పక్క టిడిపి పార్టీ చుక్కాని లేని నావలా కొట్టుకుపోవడానికి రెడీగా వుంది. అయితే సినిమాల విషయానికొస్తే..  జై సింహా లాంటి యావరేజ్ హిట్ తీసిన కె ఎస్ రవికుమార్ కి మళ్ళీ రూలర్ అనే సినిమాని అప్పజెప్పాడు బాలయ్య. ఈ సినిమాకి హీరోయిన్స్ కూడా ఎలాంటి పేరున్న హీరోయిన్స్ కారు. వేదిక అవుట్ డేటెడ్ హీరోయిన్. సోనాల్ చౌహన్ అందాలు ఆరబోస్తుంది కానీ... నటనలో వీక్. డిసెంబర్ 20న బాలకృష్ణ అంతో ఇంతో క్రేజ్ ఉన్న సాయి ధరమ్ తోనూ, రాజ్ తరుణ్ తోనూ పెట్టుకోబోతున్నాడు. మరో పక్క చైతు - వెంకీల వెంకీమామకి, రూలర్ కి కేవలం వారం గ్యాప్ ఉంది.

ఇక బాలీవుడ్ నుండి సల్మాన్ హిట్ సీరీస్ దబాంగ్ 3 తో పోటీకి రావడం, ఖైదీ హిట్ తో ఉన్న కార్తీ దొంగతో రావడం చూస్తుంటే.. రొటీన్ స్టోరీతో వస్తున్న బాలకృష్ణకి బ్యాండ్ బాజా మోగడం ఖాయంగా కనబడుతుంది. రూలర్ టీజర్ కానీ, సాంగ్స్ కానీ రొటీన్ గా ఉండడంతో.. బాలయ్య సినిమా బిజినెస్ కూడా అనుకున్నంతగా సాగడం లేదని ట్రేడ్ టాక్. నాలుగైదు సినిమాల మీద పోటీకి వస్తున్న బాలయ్య రూలర్ కి యావరేజ్ టాక్ పడినా కష్టమే అంటున్నారు. మరి ఈసారి బాలయ్యకి దబిడిదిబిడి ఖాయంగానే కనబడుతుంది.

Ruler Cornered by Venky Mama and Prati Roju Pandaage:

Threat to Balayya Ruler Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ