అర్జున్ రెడ్డి క్రేజ్, గీత గోవిందంతో తెచ్చుకున్న అంచనాలను అందుకోవడానికి విజయ్ దేవరకొండ సినిమా సినిమాకి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఏదో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ దెబ్బేసింది కానీ... లేదంటే విజయ్ ఈపాటికి బాలీవుడ్‌లో ఉండాల్సినోడు. అర్జున్‌రెడ్డితో ఇండియా వైడ్‌గా క్రేజ్ సంపాదించినా విజయ్ దేవరకొండ టార్గెట్ బాలీవుడ్. కానీ విజయ్ మాత్రం అంత సాహసం చెయ్యాలంటే నిన్నమొన్నటివరకు కాస్త భయపడ్డాడు. అయితే తాజాగా పూరి జగన్నాధ్‌తో కలిసి విజయ్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడట. పూరితో కలిసి ఫైటర్ సినిమా కోసం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న విజయ్ ఈ సినిమాతో పాన్ ఇండియా మూవీ చెయ్యాలని డిసైడ్ అయ్యాడని ఫిలింనగర్ టాక్.
ఎలాగూ పూరి జగన్నాధ్ కి ఇంతకుముందే బాలీవుడ్ కనెక్షన్స్ ఉండడంతో పాటుగా... పూరి దర్శకుడిగా బాలీవుడ్ లో కాస్త క్రేజుండడం, విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్‌లో అడపాదడపా కనబడుతూ అక్కడి ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు. అందుకే ఇప్పుడు ఫైటర్ సినిమాని పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దితే ఆ సినిమా క్లిక్ అవడం ఖాయమని పూరి అండ్ విజయ్‌లు భావిస్తున్నారట. అందుకే విజయ్ దేవరకొండ కూడా పూరి చెప్పిన కథని వెంటనే ఓకే చేసాడని అంటున్నారు. ఇక పూరి - ఛార్మీలు కూడా ఇతర భాషల నిర్మాతలతో విజయ్ ఫైటర్ కోసం మాట్లాడడం, కొన్ని భాషల నిర్మాతలు ఇప్పటికే ఓకే చెప్పడం, మరోపక్క కరణ్ జోహార్ కూడా విజయ్ దేవరకొండ సినిమాపై ఇంట్రెస్ట్ గా ఉండడంతో ఫైటర్ ఖచ్చితంగా పాన్ ఇండియా ఫిలింగా తెరకెక్కడం ఖాయమనే సంకేతాలు కనబడుతున్నాయి.