భారీ బడ్జెట్ సినిమాల్లో చాలా వరకు యాక్షన్ తోనే సినిమాకి క్లైమాక్స్ కార్డు వేస్తారు. హీరోగారు భారీ యాక్షన్‌తో విలన్స్‌ని చితక్కొట్టి... విలన్స్ ని చంపితేనే సినిమాకి మంచి క్రేజ్, అభిమానులకు ఫుల్ హ్యాపీ ఉంటుంది. హీరో ఫైట్ చేస్తేనే ఫ్యాన్స్‌కి పండగ. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం ఎమోషన్‌తోనో.. లేదంటే ఫన్నీగానో ఎండ్ కార్డు వేస్తారు. కానీ ఎమోషన్ కామెడీ బలంగా ఉంటే ఆ సినిమాకి కిక్ వస్తుంది. అయితే తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాని కూడా కామెడీగానే క్లైమాక్స్‌ని అనిల్ రావిపూడి సెట్ చేసినట్టుగా ఫిలింనగర్ టాక్.
సినిమాలో మహేష్ కామెడీ కామెడీగా యాక్షన్ కూడా చేస్తాడని సరిలేరు టీజర్‌లోనే చూసాం. అయితే సినిమా చివరిలో కూడా యాక్షన్ కాకుండా కామెడీతో సినిమాకి శుభం కార్డ్ వెయ్యబోతున్నారని టాక్. ఈ సినిమాలో మహేష్ ఆర్మీలో పనిచేసే వ్యక్తి. అయితే సినిమా చివరిలో ప్రకాష్ రాజ్‌ని భయపెట్టడం, ప్రకాష్ రాజ్ పాత్ర ద్వారా కామెడీ పండిస్తూనే.... రెండు మూడు ఫన్నీ డైలాగ్స్ తో సినిమాని అనిల్ రావిపూడి ముగిస్తాడని తెలుస్తుంది. స్వతహాగా అనిల్ రావిపూడి కామెడీలో దిట్ట. మరి ప్రకాష్ రాజ్ సరిలేరు టీజర్‌లోనే మహేష్‌ని చూసి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు... కానీ ఇప్పుడు మొగుడొచ్చాడు అని చెప్పినట్టుగా... సినిమా క్లైమాక్స్‌లో ప్రకాష్ రాజ్ చేసే కామెడీ కడుపుబ్బా నవ్వించడం ఖాయమట.