Advertisementt

‘జాన్’ మూవీ: ప్రభాస్, పూజా పాత్రలు ఇవేనా!?

Thu 05th Dec 2019 06:35 AM
john movie,prabhas,pooja hegde,roles,darling  ‘జాన్’ మూవీ: ప్రభాస్, పూజా పాత్రలు ఇవేనా!?
John Movie : Prabhas, Pooja Hegde Roles Details Here.. ‘జాన్’ మూవీ: ప్రభాస్, పూజా పాత్రలు ఇవేనా!?
Advertisement
Ads by CJ

బాహుబలి’ సినిమా సూపర్ డూపర్ హిట్టవడంతో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. అయితే ‘సాహో’ చిత్రంతో ఆ పేరు మరింత మార్మోగుతుందని ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్తుందని భావించినప్పటికీ ఆశించిన రీతిలో సినిమా ఆడలేదు. దీంతో ఇక భారీ సినిమాలు కాకుండా చిన్న సినిమాలే అయినా బాక్సాఫీస్‌ను షేక్ చేసే రీతిలో ఉండాలని రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ ‘జాన్’గా పెట్టారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒకటి, అర అప్డేట్స్ అందాయి. అయితే సినిమా ఎలా ఉంటుంది..? ఏ జోనర్‌లో తెరకెక్కుతోంది..? అని అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

మ్యూజిక్ టీచర్‌గా పూజా!

అయితే తాజాగా సినిమాకు సంబంధించి కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పూజా పాత్ర ఓ మ్యూజిక్ టీచర్‌గా కనిపిస్తుందని టాక్ నడుస్తోంది. పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ లేడీ టీచర్ను పోలి ఉంటుందట. అందుకే ఆమె లుక్‌కు సంబంధించి డైరెక్టర్ కసరత్తులు చేస్తున్నాడని సమాచారం. అంటే కాస్త అటు ఇటు ‘ఏక్‌నిరంజన్’ సినిమాలో ఉంటుందన్న మాట. ఈ సినిమాలో హీరోయిన్ కూడా మ్యూజిక్ టీచర్‌గా నటించిన విషయం తెలిసిందే. అంటే అప్పుడు ఏక్.. ఇప్పుడు జాన్‌లో మ్యూజిక్ టీచర్‌ను దింపుతున్నారన్న మాట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ తాను మంచి పాత్రలో చేస్తున్నాని.. ఆ పాత్ర అందరికీ నచ్చుతుందని చెప్పుకొచ్చింది.

డబుల్ రోల్‌లో డార్లింగ్

ఈ సినిమాలో ప్రభాస్ డబుల్ రోల్‌లో నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు గుప్పుమన్నాయి. ఒక పాత్ర ఓల్డ్ గెటప్‌లో.. మరోటి యంగ్ గెటప్ ఉంటుందట. ఇందులో ఓ పాత్రలో అత్యంత ధనవంతుడిగా ప్రభాస్ కనిపిస్తాడట. అలాగే పేదింటి అమ్మాయి ప్రేమలో పడి.. ఆమె కోసం సర్వం కోల్పోయి.. ప్రేమ కోసం అన్నీ వదిలేస్తాడని సమాచారం. మొత్తమ్మీద కథ మొత్తం 1960 కాలంలా సాగుతుందట. ప్రభాస్, పూజా పాత్రలపై వస్తున్న పుకార్లు ఏ మాత్రం నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన లేదా సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ వేచి చూడాల్సిందే.

John Movie : Prabhas, Pooja Hegde Roles Details Here..:

John Movie : Prabhas, Pooja Hegde Roles Details Here..  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ