రాజమౌళి బాహుబలి విషయంలో టైం తీసుకుంటే తీసుకున్నాడు కానీ... ఆ సినిమా అన్ని భాషల ప్రేక్షకులు మెచ్చేలా స్పెషల్ కేర్ తీసుకుని మరీ తీర్చిదిద్దాడు. బాహుబలిని అన్ని భాషల ప్రేక్షకులు ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు పెద్ద హిట్ చేశారు. బాహుబలి సినిమాతో టాలీవుడ్‌ని ప్రపంచపటంలో నిలబెట్టిన రాజమౌళి ఇప్పుడు తెరకెక్కిస్తున్న RRR విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుని పది భాషల్లో సినిమాని విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చేలా RRRపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట రాజమౌళి. రామ్ చరణ్ జంజీర్‌తో బాలీవుడ్‌లో అట్టర్ ప్లాప్ అందుకోవడం, ఎన్టీఆర్‌కి అసలు బాలీవుడ్ పరిచయం లేకపోవడంతో.. అక్కడి ప్రేక్షకులు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్ ఉన్నప్పటికీ.. రాజమౌళి కథ, తన పాత్రల మీదున్న నమ్మకంతో బాలీవుడ్‌లో RRR విషయంలో కాస్త కూల్ గా వున్నట్లుగా తెలుస్తుంది.
అందులో సాహో, సైరా లాంటి భారీ బడ్జెట్ సినిమాలు బాలీవుడ్‌లో ఘోరంగా దెబ్బతినడంతో... బాలీవుడ్ ప్రేక్షకులకు RRR మీద డౌట్ ఉంటుంది. సాహో కానీ సైరా కానీ బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. బాహుబలి ఎంత పెద్ద హిట్ అయినా... సాహో, సైరా ఎఫెక్ట్ RRR మీద పడకుండా చూడాలని రాజమౌళి తన టీంతో చెప్పడమే కాదు... దానికి కావాల్సిన ప్రమోషన్స్ కూడా పక్కాగా ఉండాలని అనుకుంటున్నాడట. జనవరి నుండి RRR విడుదలయ్యే జూలై 30 వరకు ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో చేయాలని.. అప్పుడే సినిమా మీద ఆటోమేటిక్‌గా క్రేజ్ వస్తుందని రాజమౌళి భావిస్తున్నాడట. ఏదైనా బాలీవుడ్ మీద మాత్రం రాజమౌళి స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని టాక్.