Advertisementt

‘చూసీ చూడంగానే’ ట్రైలర్ వదిలారు

Wed 04th Dec 2019 10:40 PM
choosi choodangaane,trailer release,suresh babu,tharun bhasker,raj kandukuri  ‘చూసీ చూడంగానే’ ట్రైలర్ వదిలారు
Choosi Choodangaane Trailer Released ‘చూసీ చూడంగానే’ ట్రైలర్ వదిలారు
Advertisement
Ads by CJ

‘చూసీ చూడంగానే’ చిత్రం ట్రైలర్‌ను సంయుక్తంగా రిలీజ్ చేసిన పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ మరియు ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు

శివ కందుకూరి హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘చూసీ చూడంగానే’. ఈ చిత్రంలో శివ కందుకూరి సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిలిమ్‌ఫేర్, జాతీయ అవార్డులను దక్కించుకుని తెలుగు సినిమాల ఘనతను చాటిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు ‘పెళ్ళిచూపులు’, ‘మెంటల్ మదిలో’లను నిర్మించిన టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి.. తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ కందుకూరి గ‌త చిత్రాల్లాగానే ఈ చిత్రం కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ అసోసియేష‌న్‌లో విడుద‌ల‌వుతుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ మరియు ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు విడుదల చేశారు. 

నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ‘మెంట‌ల్ మ‌దిలో’ కెమెరామెన్ వేద రామ‌న్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. డిసెంబర్ నెల చివరి వారంలో ఈ చిత్రం విడుదల కాబోతోంది.

Choosi Choodangaane Trailer Released:

Choosi Choodangaane Trailer jointly Launched By Pellichoopulu director Tharun Bhasker and famous Producer D.Suresh Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ