అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతికి విడుదల అంటున్న సినిమాల్లో ప్రమోషన్స్ పరంగా యమా క్రేజ్‌తో ఓ రేంజ్‌లో ముందుంది. అల్లు అర్జున్ ప్లానింగ్ ప్రమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యి.. సినిమా మీద క్రేజ్ అంతకంతకు పెరిగిపోతుంది. అల వైకుంఠపురములో టీజర్ డిసెంబర్ 1 గాని 3 కానీ అన్నారు. కానీ ప్రమోషన్స్ ని కాస్త పక్కనబెట్టిన అల వైకుంఠపురములో టీంకి సరిలేరు నీకెవ్వరు టీజర్ ఇచ్చిన షాక్ కి మైండ్ బ్లాక్ అయ్యింది. కానీ తాజాగా విడుదలైన సరిలేరు సాంగ్ చూసాక అల వైకుంఠపురములో టీం ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే ‘అల వైకుంఠపురములో’ సాంగ్ కి, సరిలేరు సాంగ్ పోటీ ఇవ్వలేకపోయింది.
అయితే మరి 40 రోజుల్లో విడుదల కాబోతున్న సినిమా ప్రమోషన్స్ ఆపకూడదని, సామజవరగమనా సాంగ్ లిరికల్ గా హిట్ అయ్యి.. వంద మిలియన్ వ్యూస్ దాటడంతో.. కలర్ ఫుల్ గా ఈ సాంగ్ విజువల్స్ ని వదిలితే సినిమాకి మరింత కలర్ ఫుల్ క్రేజ్ రావడం ఖాయమని భావిస్తున్నారట. సామజవరగమన పాట తాలూకు విజువల్స్‌తో నిమిషం నిడివి ఉన్న వీడియోని వదలడానికి ప్లాన్ చేశారట. ఇక అల వైకుంఠపురములో టీజర్ గాని సామజవరగమన విజువల్స్ కానీ ఏదో ఒకటి వదిలి సినిమా మీద మరింత హైప్ పెంచాలని చూస్తున్నారట.