అనిరుధ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం గ్రాండ్ గానే ఇచ్చాడు. ‘అజ్ఞాతవాసి’ సినిమాతో తెలుగులో తెగ ఫెమస్ అవ్వాలని చూడడంతో.. పవన్ కళ్యాణ్ కన్నా ముందు ఓ పాటేసుకుని తనకి తాను ప్రమోషన్స్ చేసుకున్నాడు. నిర్మాతలు హారిక హాసిని వారు కూడా త్రివిక్రమ్ చెప్పాడని అనిరుధ్ పబ్లిసిటీ సాంగ్‌కి బాగా ఖర్చు పెట్టారు. ‘అజ్ఞాతవాసి’ గనక హిట్ అయితే అనిరుధ్‌ని తట్టుకోవడం నిర్మాతలకు తలకి మించి భారమయ్యేది. తాజాగా మరో మ్యూజిక్ డైరెక్టర్ కూడా అనిరుద్‌లా ప్రమోషన్స్‌కి తహతహలాడుతున్నాడని సమాచారం.
‘అలా వైకుంఠపురంలో..’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆ సినిమాలోని రెండు పాటలతో తెగ ఫెమస్ అయ్యాడు. రెండు పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అవడం సినిమా మీద భారీ క్రేజ్ రావడంతో... థమన్‌కి కొత్త ఆశ పుట్టింది. ‘సామజవరాగమనా..’ సాంగ్‌ని తన టీంతో తనకి తానుగా ప్రమోట్ చేసుకున్న థమన్ ఇప్పుడు నిర్మాతలకు ఓ కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అదేమిటంటే నాపై ఒక స్పెషల్ సాంగ్ వీడియో చెయ్యాలని, అందుకోసం ఒక స్పెషల్ సెట్ వెయ్యాలని అడిగాడట. అయితే త్రివిక్రమ్ ఇప్పటికే అలా వైకుంఠపురములో సినిమాకి బడ్జెట్ కకంట్రోల్ లేకుండా ఖర్చు పెట్టించడంతో.. ఇప్పుడు థమన్‌కి మరో స్పెషల్ సెట్‌కి బడ్జెట్ మరింత పెరుగుతుంది గనుక నిర్మాతలు థమన్ కండిషన్‌కి తలలు పట్టుకున్నారని వినికిడి. అయితే థమన్ అడిగిన దాన్ని మాత్రం ప్రస్తుతం హోల్డ్‌లో పెట్టారట.