ఈ మధ్యన నెటిజెన్స్ హీరోయిన్స్ మీద వాళ్ళ గ్లామర్ మీద కామెంట్ చెయ్యడం పరిపాటిగా మారింది. సమంత లాంటోళ్ళు నెటిజెన్స్ ఎమన్నా అంటే ఊరుకోరు. వారికీ తగిన సమాధానం చెబుతుంటారు. తాజాగా సమంత లా మరో హీరోయిన్ కూడా తనని కామెంట్ చేసిన నెటిజెన్ మీద ఫైర్ అవడమే కాదు.... అతనికి తగిన బుద్ది చెప్పింది. నిధి అగార్వల్ తాజాగా సోషల్ మీడియాలో ఓ హాటెస్ట్ ఫోటోని ఫోటోని పోస్ట్ చేసింది. అయితే నిది హాట్ ఫొటోస్ చూసిన ఓ నెటిజెన్ నిధి నీలాంటి వాళ్ళు పోస్ట్ చేస్తున్న ఇలాంటి హాట్ గ్లామర్ ఫొటోస్ వలనే మహిళలు అత్యాచారాలకి గురవుతున్నారు అంటూ షాకింగ్ కామెంట్ చెయ్యడంతో నిధి కి బాగా మండింది.
దానితో నిధి కూడా ఆ నెటిజెన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఈ వ్యక్తి దారుణమైన ఆలోచనా విధానం తనను షాక్ కు గురి చేసిందని చెప్పింది. ఇలాంటి వాళ్ళను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అంటూ... నీ అడ్రెస్స్ పంపిస్తే... నీకు పింక్ అనే సినిమా లింక్ పంపిస్తాను, అలాంటి సినిమా చూడడం నీలాంటి వారికి చాలా అవసరం అంటూ ఆ నెటిజెన్ కి ఘాటు రిప్లై ఇచ్చింది.మరి అలాంటి నెటిజెన్స్ ఇలాంటి ధారుణమైన కామెంట్స్ కి ఇలానే బుద్ది చెప్పాలి అంటూ నిధి ని అందరూ మెచ్చేసుకుంటున్నారు.