స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన’ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటకు ఇప్పటివరకు యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. సౌత్ ఇండియాలో ఒక పాటకు ఇన్ని వ్యూస్ రావడం ఇదే ప్రథమం. రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించిన తెలుగు పాటకు నెటిజన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ పాటకు లక్షల్లో టిక్ టాక్‌లు చేసి ఈ పాటను భారీ హిట్ చేశారు. సుప్రసిద్ధ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించిన ఈ గీతానికి తమన్ అద్భుతమైన ట్యూన్ అందించారు. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఇప్పటికీ విశేష ఆదరణకు నోచుకుంటోంది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయిలో మిలియన్స్ లో వ్యూస్ , లక్షల్లో లైక్స్ రావడం విశేషం.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో...’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.
నటీనటులు :-
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు :-
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్
సంగీతం: థమన్.ఎస్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఏ.ఎస్ ప్రకాష్
ఫైట్స్: రామ్- లక్ష్మణ్
పీఆర్వో : లక్ష్మి వేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పిడివి. ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు).