Advertisementt

రోజా నో అంటే విజయశాంతి ఉందిగా..!

Sun 01st Dec 2019 06:15 PM
vijayashanthi,balakrishna,boyapati srinu,roja,villain role  రోజా నో అంటే విజయశాంతి ఉందిగా..!
Who is Balayya and Boyapati Movie Villain? రోజా నో అంటే విజయశాంతి ఉందిగా..!
Advertisement
Ads by CJ

రోజా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో యాక్టీవ్ పర్సన్. ఎమ్యెల్యేగా, ఎపీఐఐసి చైర్ పర్సన్ గా రోజా నగరినే కాదు.. ఏపీ మొత్తం చుట్టేస్తోంది. అయితే రోజా రాజకీయాలతో బిజీ అయినప్పటికీ... జబర్దస్త్ ప్రోగ్రాంతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. తాజాగా రోజాకి, బాలకృష్ణ సినిమాలో ఓ బంపర్ ఆఫర్ వచ్చిందని.... బాలయ్యకు సవాల్ చేసే విలన్ పాత్రతో బోయపాటి, రోజాని కలిశాడనే న్యూస్ నడిచింది. అయితే బాలయ్య సినిమాలో రోజా విలన్ అన్నారు కానీ.. రోజా కన్ఫర్మ్ చేసినట్లుగా న్యూస్ లేదు. తాజా సమాచారం ప్రకారం బోయపాటి, రోజాని బాలయ్య సినిమా కోసం సంప్రదించగా.. ప్రస్తుతం జబర్దస్త్‌తోనే బిజీగా వున్నా.... మరోపక్క రాజకీయాలతో టైం సరిపోవడం లేదు.. కనక బాలయ్య సినిమా చేయలేనని చెప్పిందట.

దానితో రోజాని ఫోర్స్ చెయ్యడం బాగుండదని భావించిన బోయపాటి.. రోజా ప్లేస్‌లో మరో పవర్ ఫుల్ మాజీ హీరోయిన్ కోసం వేట మొదలెట్టాడట. తాజాగా మహేష్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి అయితే బాలయ్య మీద సవాల్ విసరడానికి బావుంటుందని యోచనలో బోయపాటి ఉన్నాడట. మరి విజయశాంతి పాత్రలు నచ్చితే సినిమాలు కంటిన్యూ చేస్తానని చెప్పింది. ఒకవేళ బోయపాటి చెప్పిన రోల్ గనక నచ్చితే.. బాలయ్య సినిమాలో విజయ్ శాంతి విలన్ రోల్ కి ఓకే చెబుతుందనే నమ్మకంగా ఉన్నారట. 

Who is Balayya and Boyapati Movie Villain?:

VijayaShanti for Balayya and Boyapati Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ