అల వైకుంఠపురములో పోస్టర్స్ కానీ, సాంగ్స్‌ని కానీ చాలా ఎర్లీగా అంటే సినిమా విడుదలకు మూడు నెలల ముందే ఒక్కొక్కటిగా వదులుతూ సినిమా మీద అల్లు అర్జున్ - త్రివిక్రమ్ బజ్ తో పాటు క్రేజ్ కూడా పెంచేశారు. రెండే రెండు పాటలు అల వైకుంఠపురములో సినిమాని ఆకాశంలో నిలబెట్టాయి. సామజవరగమనా, రాములో రాముల పాటలు ఒకదాని మీద ఒకటి పోటీ పడి మరీ క్రేజ్ సంపాదించాయి. అయితే నిన్నమొన్నటివరకు తెగ హడావిడి చేసిన అల వైకుంఠపురములో టీం ఇప్పుడు సైలెంట్ అయ్యింది. అల టీజర్ డిసెంబర్ ఫస్ట్ అంటూ ప్రచారం జరిగినా యూనిట్ నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.
అయితే ఇప్పటివరకు క్రేజ్ పెంచింది చాలు.. ఇక అంతగా క్రేజ్ పెంచాల్సిన అవసరం లేదు... బిజినెస్ కూడా అల సాంగ్స్‌తో భారీగానే మొదలైంది.. అందుకే ఇప్పటి నుండి సినిమా షూటింగ్ అండ్ ప్రొడక్షన్ మీద టైం స్పెండ్ చేసి.. సక్రమంగా సినిమాని విడుదల చెయ్యాలని త్రివిక్రమ్ అండ్ నిర్మాతలు భావిస్తున్నారట. ఇక టీజర్ సండే కానీ... డిసెంబర్ 3న కానీ విడుదల చేద్దామని, ట్రైలర్ రిలీజ్‌ని కాస్త గ్రాండ్‌గా చేసి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఓ రేంజ్ లో చెయ్యాలని భావిస్తున్నారట.