Advertisementt

‘భాగ‌మ‌తి’ రీమేక్.. అనుష్క పాత్రలో ఎవరంటే..!

Sun 01st Dec 2019 05:51 PM
bhaagamathie,hindi remake,durgavati,bhumi pednekar  ‘భాగ‌మ‌తి’ రీమేక్.. అనుష్క పాత్రలో ఎవరంటే..!
Bhaagamathie Hindi remake titled Durgavati.. Here Heroine Details.. ‘భాగ‌మ‌తి’ రీమేక్.. అనుష్క పాత్రలో ఎవరంటే..!
Advertisement
Ads by CJ

ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ‘బాహుబలి-2’ చిత్రం తర్వాత అందాల భామ అనుష్క.. లేడీ ఓరియెంటెడ్‌ రోల్‌లో చేసిన సినిమా ‘భాగమతి’. ‘ఎవడు పడితే వాడు రావడానికి.. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా..’ అంటూ అప్పట్లో ఈ భామ బాగానే హడావుడి చేసింది. సినిమా సక్సెస్ కూడా అయ్యింది.. అంతేకాదు.. కెరియర్‌లో చెప్పుకోదగ్గ ఓ సినిమాగా కూడా మిగిలిపోయింది. మరోవైపు దర్శకుడు అశోక్‌ రేంజ్ సైతం ‘భాగమతి’ పెంచేసింది. సినిమా ఆంచనాలకు మించి కూడా ఆడింది. మరీ ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్ కోసమే జనాలు థియేటర్లకు క్యూ కట్టారంటే అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్టవ్వడంతో బాలీవుడ్‌‌లో రీమేక్ చేయాలని ఈ దర్శకుడే ప్లాన్ చేస్తున్నాడట. బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్‌ తీసుకున్నారు. తెలుగులో ‘భాగమతి’ని హిందీలో ‘దుర్గావతి’గా పేరుకూడా మార్చేశారు. కాగా ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్‌తో కలిసి టి.సిరీస్ వారు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలో మార్పులు చేర్పులు చేసే పనిలో డైరెక్టర్ నిమగ్నమయ్యాడట. అది కాస్త పూర్తి కాగానే సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.

ఇక భూమి విషయానికొస్తే.. ‘బాలా’ సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమా అందుకోగా.. ‘పతి పత్ని ఔర్ వో’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాల్లో అవకాశాలు కూడా గట్టిగానే వస్తున్నాయ్. ‘దాంపత్య సమస్యలుంటే నా వద్దకు రండి’ అంటూ ఇటీవలే సోషల్ మీడియాలో ‘వేదికా లవ్‌లైన్’ అనే క్యాంపెయిన్ ద్వారా భార్యాభర్తలకు ఆమె పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో ‘భాగమతి’ బాగానే కాసుల వర్షం కురిపించింది.. మరీ ‘దుర్గావతి’ ఏ మాత్రం రాబడుతుందో వెయిట్ అండ్ సీ.

Bhaagamathie Hindi remake titled Durgavati.. Here Heroine Details..:

Bhaagamathie Hindi remake titled Durgavati.. Here Heroine Details..  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ