Advertisementt

మోక్షజ్ఞ‌ని చూసి తట్టుకోలేకపోతున్నారు

Sun 01st Dec 2019 05:50 PM
nandamuri mokshagna,family pic,nandamuri fans,mokshagna latest photo,balakrishna son  మోక్షజ్ఞ‌ని చూసి తట్టుకోలేకపోతున్నారు
Nandamuri Mokshagna Latest Look Creates Sensation మోక్షజ్ఞ‌ని చూసి తట్టుకోలేకపోతున్నారు
Advertisement
Ads by CJ

బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు తహతహలాడుతున్నారు. బాలయ్య కూడా మోక్షు ఎంట్రీపై అప్పుడప్పుడు చెబుతున్నాడు కానీ.. పక్కా డేట్ ఇవ్వడం లేదు. వచ్చే ఏడాది, ఆపై వచ్చే ఏడాది అంటూ మోక్షు ఎంట్రీకి ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటే మంచి ఫిజిక్, మంచి షార్ప్‌నెస్ ఉండాలి కానీ మోక్షులో మాత్రం అవేం కనిపించడం లేదు. అన్ని ఉండాలి కానీ మోక్షజ్ఞని చూస్తుంటే మాత్రం హీరో మెటీరియల్‌లా అనిపించడం లేదు. ఇంతకుముందు ఒకసారి గుడిలో ఏవో పూజలు చేస్తున్నప్పుడు మోక్షజ్ఞ చాలా లావుగా కనిపించాడు.

ప్రస్తుతం బాలకృష్ణ రూలర్ సినిమా స్టిల్స్, పోస్టర్‌తో ఆనందపడుతున్న నందమూరి అభిమానులు మోక్షు ఎంట్రీ విషయం పక్కనబెట్టారు. ఇక మోక్షజ్ఞ కూడా బయట కనబడడు. ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటింగ్ చేస్తుంటాడు. ఐతే తాజాగా మోక్షజ్ఞ తన ఫ్యామిలీతో దిగిన ఓ ఫోటో చూసిన నందమూరి ఫ్యాన్స్ షాకవుతున్నారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వి, అల్లుడు భరత్, భార్య వసుంధర లతో పాటుగా మోక్షజ్ఞ కూడా ఆ ఫోటోలో ఉన్నాడు. అయితే ఆ పిక్ లో మోక్షు భారీ కాయంతో కాస్త లావుగా కనిపిస్తున్నాడు. మరి మోక్షజ్ఞ‌ని ఇలా చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అసలు మోక్షజ్ఞకి హీరో అవ్వాలని ఉందా? లేదా? అనే మీమాంశలో ఇప్పుడు అభిమానులు నిరాశ పడుతూ కనబడుతున్నారు. బాలయ్యేమో.. సినిమా కోసం 20 కేజీల బరువు తగ్గి యంగ్ కుర్రాడిలా కనబడుతుంటే... మోక్షు మాత్రం అలా బరువు పెరిగి కనబడుతుంటే నందమూరి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. 

Nandamuri Mokshagna Latest Look Creates Sensation:

Pic: Nandamuri Mokshagna with Family

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ