Advertisementt

ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ తమిళ్ హీరో విజయ్ ఫ్యాన్స్!

Sat 30th Nov 2019 09:36 PM
jr ntr,tamil star hero vijay,fans,war,dance,jr ntr fans,vijay fans  ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ తమిళ్ హీరో విజయ్ ఫ్యాన్స్!
Young Tiger NTR Fans vs Tamil Star Hero Vijay Fans ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ తమిళ్ హీరో విజయ్ ఫ్యాన్స్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో డ్యాన్స్‌ల పరంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీలు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు. ముగ్గురికి ముగ్గురే డ్యాన్స్‌ల విషయంలో దుమ్మురేపగల సత్తా ఉన్న స్టార్ హీరోస్. ఇక తమిళనాట మాత్రం డ్యాన్స్ వేసే హీరోలు చాలా అరుదు. అసలు అరుదు ఏమిటి తెలుగు హీరోలను తలదన్నేలా ఒక్క హీరో కూడా డ్యాన్స్ చెయ్యడు. కొద్దో గొప్పో విజయ్ మాత్రం కాస్త డ్యాన్స్ చేస్తాడు కానీ... అది ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ అంత కాదు. కోలీవుడ్‌లో విజయ్ డ్యాన్స్ పరంగా టాపర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు తమిళ తంబీలు విజయ్ ఫ్యాన్స్ మా హీరో విజయ్ కన్నా ఎన్టీఆర్ డ్యాన్స్ గొప్పదా అంటూ సోషల్ మీడియాలో ఓవరాక్షన్ చేయడం, ఎన్టీఆర్ డ్యాన్స్, విజయ్ ఇరగదీసిన కొన్ని స్టెప్స్ ఉన్న వీడియోస్ జతచేసి సోషల్ మీడియాలో రచ్చ చెయ్యడం మొదలెట్టారు.

మరి డ్యాన్స్‌లో దుమ్మురేపే ఎన్టీఆర్‌ని అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకుంటారా... ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. డ్యాన్స్ లవర్స్ ఎవరూ ఊరుకోవడం లేదు. ఎన్టీఆర్ ముందు మీ హీరో విజయ్ బచ్చా అంటూ సోషల్ మీడియా వేదికగా తమిళ ఫ్యాన్స్‌ని ఆడేసుకుంటున్నారు. మా విజయ్ డ్యాన్స్ గ్రేట్ అంటూ తమిళ ఫ్యాన్స్ రెచ్చిపోతుంటే.. ఆగండాగండి.. మా ఎన్టీఆర్ బెస్ట్ మాస్ స్టెప్స్ ముందు మీ విజయ్‌ని డ్యాన్స్ చేసి చూపించమనండి అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. విజయ్ ఫ్యాన్స్‌కి సవాల్ విసిరారు. ఇందులో స్టార్ హీరోస్ పోటీ లేకపోయినా ఫ్యాన్స్ మధ్య మాత్రం మాటల యుద్ధం ఓ రేంజ్‌లో నడుస్తుంది.

Young Tiger NTR Fans vs Tamil Star Hero Vijay Fans:

War Between NTR fans and Vijay fans about Dance in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ