Advertisementt

‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’ ఆడియో విడుదల

Sat 30th Nov 2019 09:29 PM
veera sastha ayyappa kataksham,suman,audio release,veera sastha ayyappa kataksham movie  ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’ ఆడియో విడుదల
Veera Sastha Ayyappa Kataksham Audio Released ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’ ఆడియో విడుదల
Advertisement
Ads by CJ

‘100 క్రోర్స్ అకాడమీ-వరాంగి మూవీస్’ సంయుక్తంగా రుద్రాభట్ల వేణుగోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నభక్తి రస ప్రధాన చిత్రం ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’.  ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త వి.ఎస్.పి.తెన్నేటి ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు సమకూర్చడంతో పాటు టి.ఎస్. బద్రీష్ రామ్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఏ.జ్యోతి, రమాప్రభ, ఆకెళ్ళ, చలపతి, మాస్టర్ హరీంద్ర, అశోక్ కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం పాటలు ప్రసాద్ లాబ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదలయ్యాయి. ప్రముఖ ఆడియో కంపెనీ లహరి మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం పాటలు మార్కెట్ లోనూ, యు ట్యూబ్ లోనూ లభ్యం కానున్నాయి. ప్రముఖ సంగీత దర్శకులు వి.ఎస్.ఎల్. జయకుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇది ఆయనకు తమిళ, తెలుగు భాషల్లో కలిపి 45వ చిత్రం. శంకర్ మహదేవన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో వంటి సుప్రసిద్ధులు ఈ చిత్రంలోని పాటలకు గాత్రమందించారు. ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, లగడపాటి శ్రీధర్, రాజ్ కందుకూరి అతిధులుగా పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సుమన్ తెలుగులో హీరోగా నటించిన నూరవ చిత్రం ‘అయ్యప్ప కటాక్షం’ అసాధారణ విజయం అందుకోవాలని అభిలషించారు. 

అయ్యప్ప కరుణాకటాక్షాలతోనే ఈ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగామని, శంకర్ మహదేవన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో వంటి దిగ్గజాలతో వి.ఎస్.ఎల్.జయకుమార్ అందించిన ఆడియో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, అయ్యప్ప ఆశీస్సులతో సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్శకనిర్మాతలు వి.ఎస్.పి.తెన్నేటి - టి.ఎస్.బద్రీష్ రామ్, రుద్రాభట్ల వేణుగోపాల్ అన్నారు. భక్తితోపాటు మానసిక శక్తిని సవ్య దిశలో పెంచే సానుకూల దృక్పధాన్ని పెంచే విధంగా ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’ చిత్రం రూపొందిందని తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్: క్రాంతి, కెమెరా: వేణు మురళీధర్ వడ్నాల, సంగీతం: వి.ఎస్.ఎల్.జయకుమార్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-పాటలు: వి.ఎస్.పి.తెన్నేటి, నిర్మాతలు: వి.ఎస్.పి.తెన్నేటి- టి.ఎస్.బద్రీష్ రామ్, దర్శకత్వం: రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి).  

Veera Sastha Ayyappa Kataksham Audio Released:

Suman Veera Sastha Ayyappa Kataksham Movie Audio Launch Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ