Advertisementt

‘రంగమార్తాండ’లో అనసూయ పాత్ర ఇదేనా?

Sat 30th Nov 2019 02:15 PM
anasuya,krishna vamsi,ranga marthanda,movie  ‘రంగమార్తాండ’లో అనసూయ పాత్ర ఇదేనా?
Anasuya Role Revealed in Ranga Marthanda Movie ‘రంగమార్తాండ’లో అనసూయ పాత్ర ఇదేనా?
Advertisement
Ads by CJ

రంగస్థలం సినిమా అనసూయకి ఓ మధుర జ్ఞాపకం. హీరో హీరోయిన్ పాత్రలతో పాటే రంగమ్మత్త పాత్రకి ప్రాధాన్యత ఉండడంతో అనసూయకి బాగా పేరొచ్చింది. తర్వాత ప్లాప్ సినిమాల్లో అనసూయ కనబడినా.. అనసూయ వరకు ఓకే కానీ.. సినిమాలు ప్లాప్ అవడంతో అనసూయ పేరు వినబడలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర చూసిన కృష్ణవంశీ తాను తెరకెక్కిస్తున్న రంగమార్తాండలో ఓ మంచి ఆఫర్ ఇచ్చాడు. రంగమార్తాండ ఈ మధ్యనే సైలెంట్ గా షూటింగ్ మొదలెట్టుకుంది. మరాఠీలో నానా పాటేకర్ ముఖ్యపాత్రలో నటించిన నటసామ్రాట్ కి రీమేక్ రంగమార్తాండ.

అయితే ఈ సినిమాలో  అనసూయ పాత్ర ఇదే అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రంగమార్తాండ సినిమాలో రమ్యకృష్ణ - ప్రకాష్ రాజ్ దంపతులుగా కనిపించనున్నారని, కథలో కీలకమైన అనసూయ మాత్రం రమ్యకృష్ణ - ప్రకాష్ రాజ్ ల కూతురిగా కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. కృష్ణవంశీ కావాలని.. అనసూయకి ఇలాంటి కీలక పాత్ర ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా కథ మొత్తం ఓ సినీయర్ నటుడిని అతడి పిల్లలు చివరి రోజుల్లో ఎలా నిర్లక్ష్యం చేసారనే దానిమీదే నడుస్తుంది.

Anasuya Role Revealed in Ranga Marthanda Movie:

Anasuya in Krishna Vamsi Ranga Marthanda Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ