నందమూరి నట సింహం బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా..? అని నందమూరి వీరాభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అదుగో వస్తున్నాడు.. ఇదుగో వస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయే తప్ప ఆయన మాత్రం వచ్చింది లేదు.. అది జరిగిందీ లేదు. అప్పుడప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న మోక్షజ్ఞ ఫొటోలను చూసిన నందమూరి అభిమానులు కంగుతింటున్నారు. ఇదిగో పక్కనుండే ఫొటోను ఓ చూడండి.. మీకే అర్థమవుతుంది. ఈ లుక్ చూసిన అభిమానులు వామ్మో.. మోక్షజ్ఞ ఏంటి.. ఇలా తయారయ్యాడు..? అసలు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా..? లేదా....? ఏంటిది.. ..? అని ముక్కున వేలేసుకుంటున్నారట.
ఈ పిక్ ఫొటో షాప్‌లో మార్ఫింగ్ చేసిందో.. మరొకటే కాదండోయ్.. ఇటీవల గుంటూరు వేదికగా మోక్షజ్ఞ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఫ్యామిలీ దిగిన ఫొటోలివి. మోక్షజ్ఞ వయసేంటి..? ఆయన పొట్టేంటి..? అంటూ పలువురు విమర్శకులు సెటైర్లు పేలుస్తున్నారు. మొత్తానికి చూస్తే.. ఆయన తన శరీరంపై ఎలాంటి శ్రద్ధ పెట్టలేదన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. అయితే మోక్షజ్ఞకు సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఏ మాత్రం ఉందో..? అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
కాగా.. నందమూరి కుటుంబం హీరో ఎంట్రీ ఇచ్చి సుమారు 13 ఏళ్లు దాటిపోయింది. ఈ కుటుంబం నుంచి థర్డ్ జనరేషన్‌గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. అయితే మోక్షజ్ఞకు మాత్రం ఇండస్ట్రీలోకి రావాలనే కోరికలు లేవనే తెలుస్తోంది. అంతేకాదు.. కచ్చితంగా నటనలోకి వస్తాడని ఫ్యాన్స్ అనుకుంటుున్నప్పటికీ ఆయన ఇంట్రెస్ మాత్రం బిజినెస్ మీద ఉందని అందుకే ఇలా తయారవుతున్నాడని సమాచారం. మరి బాలయ్య మనసులో ఏముందో..? మోక్షజ్ఞ ఏమవ్వాలనుకుంటున్నాడో ఆ ఫ్యామిలీకే ఎరుక.