బాహుబలి సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న. బహుబలికి ఏ మాత్రం తగ్గకుండా అంతకుమించి బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ చిత్రంలో స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారు. ఇప్పటికే సుమారు సగం సినిమాకు పైగా షూటింగ్ అయిపోయిందని చిత్రబృందమే ప్రకటించింది. అయితే సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని వివరాలను వెల్లడించిన చిత్రబృందం.. ఇటీవలే ఎన్టీఆర్ సరసన నటించిన బ్రిటీష్ బ్యూటీని జక్కన్న పరిచయం చేసిన విషయం విదితమే.
తాజాగా ఇందుకు సంబంధించి మరో పుకారు వెలుగు చూసింది. చెర్రీ- అలియా భట్ మీద రామోజీ ఫిలిం సిటీలో ఓ రొమాంటిక్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయ్. అయితే ఇంత వరకూ అలియా అస్సలు షూటింగ్‌లోనే పాల్గొనలేదని.. త్వరలోనే షూటింగ్ ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే అదంతా తూచ్ అంట.. అలియా భట్‌కు సంబంధించిన సన్నివేశాలు పూర్తయిపోయాయట. అంతేకాదు.. ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కి బాలీవుడ్ బ్యూటీ బాయ్ బాయ్ చెప్పేసిందని సమాచారం.
ఇక జూనియర్ సరసన నటించే ఒలీవియా మోరిస్‌కి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందట. డిసెంబర్ మొదటి వారంలో ఎన్టీఆర్, ఒలీవియా మధ్య నడిచే కీలక సన్నివేశాలతో పాటు, పాటల చిత్రీకరణ జరపనున్నట్లు జక్కన్న నిర్ణయించారట. నగరంలోని రామోజీ ఫిల్మ్‌సిటీలో వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. కాగా ఇటీవలే ఎన్టీఆర్ సరసన నటించిన బ్రిటీష్ బ్యూటీని జక్కన్న నిన్న పరిచయం చేసిన విషయం విదితమే. మొత్తానికి చూస్తే.. అలియాకు బాయ్ బాయ్ చెప్పిన చిత్రబృందం.. కమాన్ ఒలీవియా అని వెల్‌కమ్ పలుకుతోందన్న మాట.!