దయచేసి మనిషికి మూడు చెట్లు నాటండి .. గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ప్రఖ్యాత హాస్యనటులు అలీ, కృష్ణ భగవాన్, రఘు బాబు కలసి పిలుపునిచ్చారు!
బంజారాహిల్స్ రోడ్ నెం 12 లోగల పార్క్ నందు వీరు ముగ్గురు మూడేసి మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వ హరితహారం కార్యక్రమానికి ఆదర్శంగా కార్యక్రమం హరా హైతో భరా... అనే పిలుపుతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న గ్రీన్ ఛాలెంజ్ మాకెంతో స్పూర్తి నింపింది.
రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలోభాగంగా కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలోని జీహెచ్ ఎమ్సీ పార్క్ లో వీరు పాల్గొన్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో ప్రతి వ్యకి 3మొక్కలు చొప్పున నాటి తిరిగి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మాట్లాడుతూ... మొక్కలను నాటాలనే ముఖ్యమంత్రి కెసీఆర్ హరిత హారం సంకల్పానికి తనవంతుగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా వున్నది. ఇఫ్పటికి కోట్లకు పైగా చేరుకోవడం గర్వకారణం. మనిషి తనను తాను రక్షించుకోవాలంటే ప్రకృతిని రక్షించాల్సిందేననే మహోన్నత లక్ష్యంలో భాగంగా, సంతోష్ కుమార్ తన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నటులను ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి, మా అభిమానులకు స్పూర్తిగా నిలవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని, వనాలను పెంచడం అనే కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికి ఎంతో సంతృప్తినిచ్చింది అని తెలిపారు.