Advertisementt

పవన్‌తో టూర్‌కెళ్తా.. అన్నీ అడిగేస్తా.. జనసేనలోకి!

Fri 29th Nov 2019 06:01 PM
sree reddy,janasena,pawan kalyan,tour,pawan fans  పవన్‌తో టూర్‌కెళ్తా.. అన్నీ అడిగేస్తా.. జనసేనలోకి!
Again Sree reddy Targets Janasena Chief Pawan kalyan పవన్‌తో టూర్‌కెళ్తా.. అన్నీ అడిగేస్తా.. జనసేనలోకి!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ వివాదాస్పద నటి.. కాంట్రవర్సీ క్వీన్‌గా బిరుదు పొందిన శ్రీరెడ్డి.. హైదరాబాద్‌ను వదిలేసి చెన్నై చెక్కేసిన ఇక్కడి వ్యవహారాలు మాత్రం అస్సలు మానలేదు.. ఆమె తీరు ఇంకా మారలేదు. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆమెలో మార్పురాకపోవడం గమనార్హమని కొందరు విమర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడంటే అవకాశాల్లేవ్.. కాస్టింగ్ కౌచ్ అని హడావుడి చేసింది అదంతా అయిపోయింది ఇప్పుడంతా సాఫీగా ఉందని అందరూ అనుకుంటున్న టైమ్‌లో.. ‘అబ్బే నేనేం మారలేదు.. నేనింతే.. ఎవరేమనుకుంటే నాకేం’ అన్నట్లుగా అటు సోషల్ మీడియాలో.. ఇటు ఇంటర్వ్యూల్లో ఎవర్నో ఒకర్ని ఈ కాంట్రవర్సీ హాట్ బ్యూటీ గోకుతూనే ఉంది.

ఎవరో సంగతి పక్కనెడితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటానికి శ్రీరెడ్డి ముందుంటుంది. ఇప్పటికే మీడియాలో.. ఫేస్‌బుక్‌లో అస్తమానూ పవన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం... ఆయన అభిమానుల నుంచి బండ బూతులు తిట్టించుకోవడం పరిపాటిగా వస్తోంది. అయితే తమిళనాడుకు వెళ్లిన ఈ భామ అక్కడ యూ ట్యూబ్ చానెల్స్‌ బోల్డ్ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజిబిజీగానే ఉంది. అప్పుడప్పుడూ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాత్రం మన తెలుగు యూ ట్యూబ్ చానెల్స్ వాళ్లు ఇంటర్వ్యూలు చేయడం.. తిక్క తిక్క ప్రశ్నలేయడం.. ఆమె నుంచి ఏదో ఒక వివాదాస్పద సమాధానం రాబట్టుకోవాలనే తహతహలాడుతున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాఫిడ్ ఫైర్‌లో భాగంగా.. మీరు టూర్‌కి వెళ్లాల్సి వస్తే ఎవర్ని ఎంచుకుంటారు..? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆ హాట్ స్పందిస్తూ చాలా లాజిక్‌గా బదులిచ్చింది. ‘నాకు చాన్స్ వస్తే పవన్ కళ్యాణ్‌తో టూర్‌కు వెళ్తాను. టూర్ అంటే రొమాన్స్ అనుకుంటున్నారేమో.. అదేం కాదు.. ఆయన్ని నేను ఆడగాల్సినవి చాలా ఉన్నాయ్.. అందుకే ఆయన్ను ఎంచుకున్నాను. పవన్ పోరాటంలో నిజాయితీ నాకు ఇప్పటి వరకూ కనిపించలేదు. ఆయన మారి అనుభవం ఉన్న నాయకుడు అని నాకు అనిపిస్తే.. తప్పకుండా సపోర్ట్ చేస్తా.. అంతేకాదు తప్పకుండా జనసేనలోకి వెళ్తా’ అని ఈ హాట్ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలకు నెటిజన్లు, పవన్ వీరాభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు.

Again Sree reddy Targets Janasena Chief Pawan kalyan:

Again Sree reddy Targets Janasena Chief Pawan kalyan  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ