వివాదాస్పద నటి, కాంట్రవర్సీ క్వీన్ శ్రీరెడ్డి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎవరిపై పడి ఫొటోలు రిలీజ్ చేస్తుందో..? ఎవర్ని టార్గెట్ చేస్తుందో..? ఎవర్ని ఎత్తేస్తుందో..? శ్రీరెడ్డికే తెలియదు. అయితే ఈ మధ్య బరితెగించి మరీ డైరెక్టుగా పేర్లు బయటిపెట్టి మరీ ఎడాపెడా తిట్టిపోస్తోంది. ఈ వివాదాల మధ్యే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు సెక్సీ ఆఫర్ ఇచ్చింది. అవునా అని ఆశ్చర్యపోకండి.. మీరు వింటున్నది నిజమనండోయ్.. ఈ విషయం స్వయానా వివాదాస్పద నటి, కాంట్రవర్సీ క్వీన్ శ్రీరెడ్డి నోటితోనే చెప్పింది. ఎప్పుడూ వివాదాస్పద పోస్ట్‌లు చేసే ఫేస్‌బుక్‌లోనే ఆర్జీవీకి ఈ సెక్సీ ఆఫర్ ఇచ్చింది శ్రీరెడ్డి.
ఆర్జీవీతో డేటింగ్ చేయాలనుంది అన్నదే ఆ సెక్సీ ఆఫర్ సారాంశం. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు వామ్మో.. శ్రీరెడ్డి ఇంతలా బరితెగించిందేంటి..? అని ముక్కున వేలేసుకుంటున్నారు. కంగ్రాట్స్ అని కొందరు చెబుతుంటే.. మరికొందరు నెటిజన్లు ‘మాత్రం వాళ్లతో.. వీళ్లతో ఏంటి మేడం.. నాతో డేట్ చేయండి.. నేను రెడీగా ఉన్నాను’ అని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడు ఆర్జీవీని నోటికొచ్చినట్లు తిట్టావ్.. ఇప్పుడేమో డేట్ అది ఇదీ అంటున్నావ్.. ఏంటి మేడం అసలు మ్యాటర్ అని కామెంట్స్ కూడా వస్తున్నాయ్. అయితే ఇదంతా డ్రామా అని ఆర్జీవీ సినిమాల్లో అవకాశం ఇలా చేస్తోందని మరికొందరు తిట్టి పోస్తున్నారు.
వాస్తవానికి ఆర్జీవీ తనకు సెక్స్ అంటే ఇష్టమని.. సో.. సో అండ్ సో అని లైవ్‌లోనే చెప్పిన సందర్భాలు కోకొల్లలు. మరి శ్రీరెడ్డి సెక్సీ ఆఫర్‌కు ఆర్జీవీ ఎలా రియాక్ట్ అవుతాడు..? వర్మ ఓకే అంటాడా..? లేకుంటే అక్కర్లేదని లైట్ తీసుకుంటాడో..? అసలు ఇప్పుడు ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా రిలీజ్ కాలేదని తిక్క మీదున్నాడు.. నోటికొచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా తిట్టిపోసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఉన్నట్టుండి ఆర్జీవీపై శ్రీరెడ్డి ఎందుకు మనసు పడిందే ఆ కాంట్రవర్సీ హాట్‌కే ఎరుక.