నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ షూటింగ్ పూర్తి... డిసెంబర్ 20న విడుదల
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రూలర్’. ఈ సినిమా చిత్రీకరణ నిన్నటితో పూర్తయ్యింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మరోవైపు ప్రమోషన్లను కూడా భారీగా చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా చిరంతన్ భట్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటల లిరికల్ వీడియోలను త్వరలోనే విడుదల చేయనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు శక్తివంతమైన పాత్రలలో కనిపించనున్నారు. జై సింహా వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం కావడంతో రూలర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ లుక్స్, టీజర్‌కు ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక, జయసుధ, షాయాజీ షిండే, ధన్‌రాజ్, కారుమంచి రఘు తదితరులు కీలక పాత్రధారులు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహన్, వేదిక, ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా తదితరులు
సాంకేతిక నిపుణులు: దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్, నిర్మాత: సి.కల్యాణ్, కో - ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు, కథ: పరుచూరి మురళి, మ్యూజిక్: చిరంతన్ భట్సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, ఆర్ట్: చిన్నా, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివు, కొరియోగ్రఫీ: జానీ మాస్టర్