రాజమౌళి డైరెక్ట్ చేసే సినిమాల్లో ప్రతి సీన్ హైలెట్ గానే ఉంటుంది. రాజమౌళి పెట్టే బడ్జెట్ ఎక్కువ కావొచ్చు. కానీ ఆ బడ్జెట్ ని ఎలా వాడాలో రాజమౌళికి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. ఆయన సినిమాలు కూడా బడ్జెట్ కి తగ్గట్టుగా రిచ్ గా ఉంటాయి. ప్రభాస్ తోనే పాన్ ఇండియా ఫిలింని అందరూ మెచ్చేలా మలచిన రాజమౌళి.. ఇప్పుడు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ లతో అంతకు మించి చూపించగలదనే నమ్మకం అందరిలో ఉంది. ఇక ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి పాత్రలతో తెరకెక్కిస్తున్న RRR కోసం కూడా రాజమౌళి భారీగానే ఖర్చు పెడుతున్నాడు. ఒక్కో సీన్ ఒక్కో వజ్రంలా రాజమౌళి తీర్చిదిద్దుతున్నాడని మూవీ యూనిట్ చెబుతున్నమాట.
ఎన్టీఆర్ కొమరం భీం ఎంట్రీనే కోట్లు ఖర్చు పెట్టి అందరూ అదుర్స్ అన్న రేంజ్ లో తెరకెక్కించాడని చెబుతున్న రాజమౌళి.. ఇప్పుడు RRR లో తెరకెక్కించిన రెండు సీన్స్ గురించి ఫిలింసర్కిల్స్ లో హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆయుధం పట్టిన కొమరం భీం, బ్రిటిష్ దొరల దురాగతాలను ఎదిరిస్తూ యుద్ధభేరి మోగించిన అల్లూరిలు రెండు భిన్న సంఘటనలలో చాలా యుక్త వయసులోనే ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా చరిత్ర చెబుతుంది. అయితే రాజమౌళి కూడా ఇద్దరు వీరులు తమ ప్రాణాలు కోల్పోయే సన్నివేశాలను ఓ రేంజ్ లో తెరకెక్కించారని, కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్ లు నటన వీరోచితంగా, బంధించబడిన సింహం గాండ్రిపులా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఇద్దరు ప్రాణాలు కోల్పోయే సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయట.