ఒక సంక్రాంతి పుంజు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు టీజర్ వచ్చింది.. అందులో కామెడీ, యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్, మహేష్ లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక మరో సంక్రాంతి పుంజు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో టీజర్ రావాల్సి ఉంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా... అల వైకుంఠపురములో సినిమాకి సాంగ్స్ అన్ని ఒక బలం కాగా.. ఇప్పుడు డిసెంబర్ 1 న టీజర్ రాబోతుంది. మరి అల్లు అర్జున్ - త్రివిక్రమ్ లు కలిసి అల వైకుంఠపురములో టీజర్ లో ఏం చూపిస్తారో అనే క్యూరియాసిటీ మెగా ఫ్యాన్స్ లోనే కాదు... ప్రేక్షకుల్లోనూ మొదలైంది.
అల వైకుంఠపురములో ఇంతకుముందే విడుదలైన అల్లు అర్జున్ - మురళి శర్మల పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ తో పాటుగా ఈ టీజర్ ఫ్యామిలీ ఎమోషన్స్, త్రివిక్రమ్ మార్కు కామెడీ, పంచ్ లు మరియు బన్నీ - పూజా ల రొమాన్స్ అన్ని హైలెట్ గా ఉండబోతున్నాయని.. ప్రేక్షకులకు నచ్చేలా, ప్రేక్షకులు, అభిమానులు మెచ్చేలా అల వైకుంఠపురములో టీజర్ ని కట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి త్రివిక్రమ్ మార్క్ కామెడీ, పంచ్ లకు అల్లు అర్జున్ మ్యానరిజం తోడైతే... ఆ డైలాగ్స్ పటాసుల్లా పేలడం ఖాయం అంటున్నారు. మరి పూజ - బన్నీ రొమాన్స్, అల్లు అర్జున్ అండ్ మురళి శర్మల ఎమోషనల్ కామెడీ డైలాగ్స్ ని ఊహించేసుకుంటూ మెగా ఫ్యాన్స్ పండగ చేసేసుకుంటున్నారు.