Advertisementt

ఇస్మార్ట్ భామలకి ఇంకో బంపర్ ఆఫర్..!

Thu 28th Nov 2019 07:36 PM
nidhi agarwal,nabha natesh,chance,mega hero,new movie  ఇస్మార్ట్ భామలకి ఇంకో బంపర్ ఆఫర్..!
Superb Chance to Ismart Shankar Heroines ఇస్మార్ట్ భామలకి ఇంకో బంపర్ ఆఫర్..!
Advertisement
Ads by CJ

ఇస్మార్ట్ శంకర్ తో రెచ్చిపోయి గ్లామర్ షో చేసిన నిధి అగర్వాల్, నభా నటేష్ లకు ఓ అదిరిపోయే ఆఫర్స్ తగలకపోయినా.. ప్రస్తుతం వారిద్దరూ బిజీగానే ఉన్న భామలు. ఇస్మార్ట్ హిట్ కన్నా ముందే రవితేజతో డిస్కో రాజా సీనిమాలో నటిస్తున్న నభా నటేష్ ఇప్పుడు సాయిధరమ్ తేజ్‌తో సోలో బ్రతుకే సో బెటరు సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే టాక్ ఉంది. మరోపక్క నిధి అగర్వాల్ గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ సినిమాలో భారీ పారితోషకానికి ఆఫర్ దక్కించుకుంది. తాజాగా ఈ ఇద్దరు ఇస్మార్ట్ భామలు మరో మెగా హీరోతో జోడి కట్టబోతున్నారనే న్యూస్ వినబడుతుంది.

అది వాల్మీకితో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన వరుణ్ తేజ నటించబోయే బాక్సింగ్ నేపధ్యమున్న సినిమాలో వరుణ్ తేజ్ సరసన ఈ హాట్ గర్ల్స్ ఆఫర్ పట్టారనే టాక్ వినబడుతుంది. వరుణ్ తేజ్ - కిరణ్ కొర్రపాటి కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. మరి బాక్సర్ అంటే సిక్స్ ప్యాక్ బాడీ చూపించాలి. అందుకే వరుణ్ తేజ్ ఆ సినిమా కోసం స్పెషల్ గా మేకోవర్ అవుతున్నాడు. మరి కండల వీరుడు వరుణ్ సరసన అందాలతో రెచ్చిపోవడానికి ఈ ఇస్మార్ట్ భామలిద్దరూ ఇస్మార్ట్ గా రెడీ కాబోతున్నారట. మీడియం బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికల అవసరం ఉందని... అందుకే ప్రస్తుతం క్రేజ్ ఉన్న నిధి, నభా లైతే బావుంటుందని అనుకుంటున్నారట.

Superb Chance to Ismart Shankar Heroines:

Nidhi Agarwal and Nabha Natesh for Mega Hero

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ