Advertisementt

వెనక్కి తగ్గిన ఆర్జీవీ.. ‘కమ్మరాజ్యం..’టైటిల్ మార్పు

Thu 28th Nov 2019 01:25 PM
kamma rajyam lo kadapa reddlu,amma rajyamlo kadapa reddlu,rgv,ramgopal varama,title change  వెనక్కి తగ్గిన ఆర్జీవీ.. ‘కమ్మరాజ్యం..’టైటిల్ మార్పు
Kamma Rajyam Lo Kadapa Reddlu movie title changed వెనక్కి తగ్గిన ఆర్జీవీ.. ‘కమ్మరాజ్యం..’టైటిల్ మార్పు
Advertisement
Ads by CJ

‘అంతా ఇష్టం.. నేను తీసిందే సినిమా.. మీకు నచ్చితే లేకుంటే సైలెంట్‌గా చూడండి.. నేనింతే’ అంటూ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజా చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఆర్జీవీ సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి థియేటర్లలోకి వచ్చి ఆడేంత వరకూ ప్రతిరోజూ వివాదాలే వివాదాలుంటాయ్.. ఎందుకంటే ఆ వివాదాలే సినిమా ప్రమోషన్స్ గనుక. అంతేకాదు.. సినిమా టైటిల్, డైలాగ్స్, కొన్ని కొన్ని సన్నివేశాలను సైతం ఒక్కోసారి ఆర్జీవీ వెనక్కి తగ్గి మరీ తీసేసిన సందర్భాలున్నాయ్. అయితే ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాపై ఇప్పటికే పలు పిటిషన్లు, ఫిర్యాదులు రాగా.. ఎట్టకేలకు ఆర్జీవీ వెనక్కి తగ్గాడు.

మరోవైపు కోర్టు కూడా దీనిపై సీరియస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రివ్యూ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో విచారణకు ముందే వెనక్కి తగ్గిన ఆర్జీవీ.. సినిమా టైటిల్ మార్చాలని ఫిక్స్ అయ్యాడు. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’కు బదులుగా ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ అంటూ టైటిల్ మార్చేస్తున్నట్లు ఓ ప్రముఖ చానెల్ డిబెట్‌లో భాగంగా ఆర్జీవీ ప్రకటించాడు. వాస్తవానికి ఆర్జీవీ మాట మీద నిలబడిన దాఖలాల్లేవ్.. మరి నాలుకలేని నరం కదా ఎన్నిమాటలైనా మాట్లాడుతుంది. ఆర్జీవీ ఇదే ఫిక్సవుతాడా లేకుంటే అబ్బే అదేం లేదని మొదటిదే ఫిక్స్ అవుతాడా అనేది తెలియాల్సి ఉంది. టీవీ చానెల్‌ డిబెట్‌లో చెప్పిన ఆర్జీవీ.. ఫ్రీ ప్రమోషన్స్ చేసుకునే సోషల్ మీడియాలో మాత్రం ఇంతవరకూ ప్రకటించలేదు. మరి ఆర్జీవీ వెనక్కి తగ్గడంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అవుతుందో లేదో జస్ట్ వెయిట్ అండ్ సీ.

Kamma Rajyam Lo Kadapa Reddlu movie title changed:

Kamma Rajyam Lo Kadapa Reddlu movie title changed  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ