Advertisementt

RRR : అబ్బే అది పుకారే.. సంక్రాంతికి సర్‌ఫ్రైజ్!?

Thu 28th Nov 2019 01:12 PM
jakkanna rrr movie,ramcharan,alia bhatt,romantic song,sankranthi surprise  RRR : అబ్బే అది పుకారే.. సంక్రాంతికి సర్‌ఫ్రైజ్!?
Jakkanna RRR Movie.. Sankranthi Surprise Details Here.. RRR : అబ్బే అది పుకారే.. సంక్రాంతికి సర్‌ఫ్రైజ్!?
Advertisement
Ads by CJ

బాహుబలి సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న. బహుబలికి ఏ మాత్రం తగ్గకుండా అంతకుమించి బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ చిత్రంలో స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారు. ఇప్పటికే సుమారు సగం సినిమాకు పైగా షూటింగ్ అయిపోయిందని చిత్రబృందమే ప్రకటించింది. అయితే  సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని వివరాలను వెల్లడించిన చిత్రబృందం.. ఇటీవలే ఎన్టీఆర్ సరసన నటించిన బ్రిటీష్ బ్యూటీని జక్కన్న పరిచయం చేసిన విషయం విదితమే.

తాజాగా ఇందుకు సంబంధించి మరో పుకారు వెలుగు చూసింది. చెర్రీ- అలియా భట్ మీద రామోజీ ఫిలిం సిటీలో ఓ రొమాంటిక్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయ్. అయితే ఇది ఎంతవరకు నిజం..? సాంగ్ తెరెకెక్కిస్తున్నారా లేకుంటే ఫైట్ సీన్సా..? అసలు అలియా షూటింగ్‌ స్పాట్‌కు వచ్చిందా రాలేదా..? అని సమాచారాన్ని సేకరించగా.. చివరికి చెర్రీ- అలియాపై సాంగ్ చేయట్లేదని తేలింది. అంతేకాదు.. ఇంత వరకూ అలియా అస్సలు షూటింగ్‌లోనే పాల్గొనలేదు.

వాస్తవానికి సెప్టెంబర్‌ నెలలోనే అలియాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలని జక్కన్న ప్లాన్ చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబర్‌లో సాంగ్స్‌పై షూటింగ్ షురూ చేసి సంక్రాంతికి మెగాభిమానులకు చిన్నపాటి సర్‌ఫ్రైజ్ ఇవ్వాలని రాజమౌళి భావిస్తున్నారట. సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ‘RRR’ నుంచి కూడా ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని ఆయన అనుకుంటున్నారట. మరి ఇందులో నిజమెంతుదో ఏంటో తెలియాల్సి ఉంది.

Jakkanna RRR Movie.. Sankranthi Surprise Details Here..:

Jakkanna RRR Movie.. Sankranthi Surprise Details Here..  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ