టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమంతపై ఇప్పుడు నెటిజన్లు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. మరోవైపు నాగచైతన్యపైనా నెటిజన్లు కన్నెర్రజేస్తున్నారు. ఇందుకు కారణం.. ఇలా చేయకూడదు.. అని చెప్పకుండా ఎంకరేజ్ చేయడమే సామ్-చై చేసిన తప్పు. వాస్తవానికి సామ్‌కు ట్రోలింగ్స్ కొత్తేమీ కాదు. అయితే సామ్ ఏం ఎంకరేజ్ చేసింది..? ఇలాంటి పనులు చేయకండి అని చైతూ ఎందుకు చెప్పలేకపోయాడు..? ఎందుకు ఆ వీరాభిమానిని కలవమని చెప్పింది..? అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం.
అక్కినేని నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా.. వైజాగ్‌కు చెందిన ఓ వీరాభిమాని చై బాగుండాలని కోరుకుంటూ సింహాచలం గుడి మెట్లను మోకాళ్లతో ఎక్కి మొక్కు తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చూసిన జనాలంతా వామ్మో వీడి పిచ్చి అభిమానం పాడుగానూ అంటూ నవ్వుకున్నారు!. అయితే ఈ వీడియో చూసిన చైతూ, సామ్ తెగ సంబరపడిపోయారు. అయ్యో.. ఇలా చేయకండి.. మరీ ఇలా చేస్తే ఎలా..? ఇంకోసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోండి..? అని చెప్పాల్సింది పోయి.. అసలు తాను నమ్మలేకపోతున్నాను బాబోయ్.. దయచేసి మీరు మమ్మల్ని కలవండి అంటూ వీడియోను జతచేసి ట్విట్టర్‌లో సామ్ చెప్పుకొచ్చింది. మరోవైపు చైతూ సైతం.. అస్సలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.. థ్యాంక్యూ.. జాగ్రత్త అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ఇద్దరినీ నెటిజన్లు ఎడా పెడా వాయించేస్తున్నారు.
అసలు ఇలాంటి పనులను ఎలా ఎంకరేజ్ చేస్తారు? మోకాళ్ల నుంచి రక్తం వచ్చేలా ఆ అభిమాని మెట్లెక్కితే మీకు ఆనందంగా ఉందా..? ఇలాంటి వాటిని ఎలా ప్రోత్సహిస్తారు..? ఆ వీరాభిమాని ఎంత బాధను భరించి అన్ని మెట్లు ఎక్కాడో మీకు తెలుస్తోందా..? అసలు మీ కామెంట్‌గానీ.. పిలుపు గానీ ఏమాత్రం బాగోలేదు ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానం అనేది హద్దులు మీరితే జరిగే నష్టం గురించి సదరు అభిమానికి చెప్పే ప్రయత్నం చేయాలే తప్ప ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. మరి ఈ కామెంట్స్‌పై రీల్ లైఫ్‌లో ప్రేమలో పడి రియల్ లైఫ్‌లో ఒక్కటైన దంపతులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.