Advertisementt

డైరెక్టర్ బర్త్‌డే పార్టీలో రామ్.. ఈ వార్తలేంటి?

Tue 26th Nov 2019 08:41 PM
ram,anil ravipudi,birthday party,celebrities,sarileru neekevvaru,gossips  డైరెక్టర్ బర్త్‌డే పార్టీలో రామ్.. ఈ వార్తలేంటి?
Hero Ram Attends Anil Ravipudi Birthday Party డైరెక్టర్ బర్త్‌డే పార్టీలో రామ్.. ఈ వార్తలేంటి?
Advertisement
Ads by CJ

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ రికార్డ్ వ్యూస్‌తో యూట్యూబ్‌ని దడదడలాడిస్తుంది. ఒకే ఒక్క టీజర్ కట్ తో అనిల్ రావిపూడి సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసాడు. అసలే ఎఫ్ 2 హిట్, అందులోను మహేష్ సినిమా అంటే మాములు క్రేజ్ ఉంటుందా.... అందుకే సరిలేరు టీజర్ కూడా ప్రేక్షకులకు నచ్చడంతో.. సినిమాపై క్రేజ్ పెరిగిపోయింది. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ సూపర్ సక్సెస్ అయిన కారణంగా దర్శకుడు అనిల్ రావిపూడి మూవీ యూనిట్‌తో సహా మరికొంతమంది సన్నిహితులకు ఆదివారం నైట్ ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. మరీ ఈ పార్టీ ఓ రేంజ్ లో జరిగింది అని తెలియడానికి సోషల్ మీడియా ఉందిగా... ప్రస్తుతం అనిల్ పార్టీ పిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

అయితే అనిల్ ఇచ్చిన పార్టీకి సరిలేరు నీకెవ్వరు హీరోయిన్ రష్మిక, అనసూయలతో పాటు, కమెడియన్ శ్రీనివాస రెడ్డి, దర్శకులు వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, మెహర్ రమేష్ ఇంకా ఇస్మార్ట్ శంకర్ తో భారీ హిట్ కొట్టిన హీరో రామ్ ఉన్నారు. అయితే హీరో రామ్.. అనిల్ ఇచ్చిన పార్టీకి అటెండ్ అయ్యేసరికి... అందరి ఊహలు రామ్ - అనిల్ రావిపూడి కాంబోలో సినిమా ఉండబోతుందా అంటూ ఊహాగానాలు మొదలెట్టారు. మరి రామ్, అనిల్ రావిపూడి స్పెషల్ పార్టీలో కనబడేసరికి భవిష్యత్తులో వీరిద్దరు కలిసి సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా అనే అనుమానం అందరిలోనూ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం రామ్ రెడ్ తోనూ, అనిల్ ‘సరిలేరు నీకెవ్వరు’తో బిజీగా వున్నారు. మరి అనిల్ రావిపూడి తదుపరి చిత్రం ఫైనల్ కాలేదు, రామ్ సినిమా కూడా ఫైనల్ అవ్వలేదు. అంటే అనిల్ - రామ్ అంటూ అప్పుడే న్యూస్ లు మొదలైపోయాయి. అయితే కొంతమంది మాత్రం పార్టీ చేసుకున్నోళ్లంతా సినిమాలు చేస్తున్నట్టేనా అంటున్నారు.

Hero Ram Attends Anil Ravipudi Birthday Party:

Gossips on Anil Ravipudi and Ram Combo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ