తెలుగు హీరోయిన్స్‌కి తెలుగులో ఆఫర్స్ ఉండవు కానీ.. పర భాషల్లో వాళ్ళకి రెడ్ కార్పెట్ ఉంటుందనేది ఎప్పటినుండో చూస్తూనే ఉన్నాం. ఇక్కడివాళ్ళు హీరోయిన్స్‌గా ఎదగడానికి పడని కష్టం ఉండదు.. అయినా ఫలితం సూన్యం. తెలుగు హీరోయిన్‌గా తెరకు పరిచయమైన ఈషా రెబ్బ ఇంకా హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చూడగానే తెలుగందం ఉట్టిపడేలా కనిపించే ఈషా రెబ్బ ఈమధ్యన గ్లామర్ షో అంటూ రకరకాల ఫోటో షూట్స్‌తో దర్శకనిర్మాతలు రెచ్చగొడుతోంది. అయినా పని జరగడం లేదు.
తాజాగా రాగల 24 గంటల్లో సినిమా విడుదలైంది. అయితే ఇషా రెబ్బ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆ థ్రిల్లింగ్ మిస్ అవడంతో ప్రేక్షకులు ఆ సినిమాకి బై బై చెప్పారు. అటు రివ్యూస్, ఇటు ప్రేక్షకులు కూడా రాగల 24 గంటల్లో సినిమాకు నెగెటివ్ టాక్ ఇవ్వడంతో... మెయిన్ ఆ సినిమా దెబ్బ ఈషా రెబ్బ మీద పడింది. ఆ సినిమా హిట్ అయితే కాస్త మంచి సినిమాలలో అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఎంతగా గ్లామర్ షో చేసినా.. ఈ తెలుగు పిల్లకి కష్టమే అంటున్నారు. ఇపుడు ఈషా రెబ్బ తెలుగులో ఉంటుందో.. పక్క భాషలో ప్రయత్నిస్తుందో చూద్దాం.