Advertisementt

న‌వంబ‌ర్ 29న బెల్లంకొండ శ్రీనివాస్‌ న్యూ మూవీ!

Tue 26th Nov 2019 08:48 AM
bellamkonda srinivas,santhosh srinivas,new movie,opening details  న‌వంబ‌ర్ 29న బెల్లంకొండ శ్రీనివాస్‌ న్యూ మూవీ!
Bellamkonda Srinivas, Santosh Srinivas Film Grand Launch On 29th న‌వంబ‌ర్ 29న బెల్లంకొండ శ్రీనివాస్‌ న్యూ మూవీ!
Advertisement
Ads by CJ

న‌వంబ‌ర్ 29న బెల్లంకొండ శ్రీనివాస్‌, సంతోష్ శ్రీనివాస్‌ల చిత్రం గ్రాండ్ లాంచ్‌

ఈ ఏడాది ‘రాక్ష‌సుడు’తో సూప‌ర్ హిట్ అందుకున్న యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో సినిమా రూపొంద‌నుంది. న‌వంబ‌ర్ 29న హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా గ్రాండ్ లాంచ్ చేస్తున్నారు. ఈ ప్రారంభోత్స‌వానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్నారు. రెగ్యుల‌ర్  షూటింగ్ డిసెంబ‌ర్ నుండి ప్రారంభం కానుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ కోసం డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీనివాస్ ప‌ర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డబోతున్నారు. అందుకోసం బెల్లంకొండ శ్రీనివాస్ ప్ర‌త్యేకంగా 8ప్యాక్స్‌తో మేకోవ‌ర్ అయ్యారు. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. సింగం, చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాల సినిమాటోగ్ర‌ఫీ అందించిన డూడ్లే ఈ సినిమాకు కెమెరామెన్‌గా ప‌నిచేయ‌బోతున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌. రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ‘అల్లుడుశీను’, ‘జ‌య‌జానకి నాయిక‌’ చిత్రాల త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌, దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

Bellamkonda Srinivas, Santosh Srinivas Film Grand Launch On 29th:

Bellamkonda Srinivas New Movie Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ