Advertisementt

80స్ బ్యాచ్ సందడి.. మిస్సయింది వీళ్లే!

Mon 25th Nov 2019 09:04 PM
chiranjeevi,class of eighties,event,rajinikanth,kamal haasan,balakrishna,mohan babu,missed  80స్ బ్యాచ్ సందడి.. మిస్సయింది వీళ్లే!
Class of Eighties Event : They are Missed 80స్ బ్యాచ్ సందడి.. మిస్సయింది వీళ్లే!
Advertisement
Ads by CJ

హైదరాబాద్ లో 80 స్ బ్యాచ్ సందడి ఈసారి చిరు ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ లో కట్టించుకున్న కొత్త ఇంట్లో అంగరంగ వైభవంగా జరిగింది. చిరంజీవి హోస్ట్ గా జరిగిన ఈ 80 స్ 10 ఇయర్స్ పార్టీ ఓ రేంజ్ లో జరిగినట్లుగా ఫిలింనగర్ టాక్. నాలుగు భాషల సూపర్ స్టార్స్ అంతా కలిసి ఓ చోట చేరడం అంటే అది అతి పెద్ద పండగే. అందులోను చిరు, నాగ్, వెంకీ, మోహన్ లాల్, సీనియర్ హీరోయిన్ రాధికా, ఖుష్బూ, సుహాసిని, జయప్రద, జయసుధ ఇలా అంతా ఓ చోట చేరితే ఆ అల్లరే వేరు. మరి చిరంజీవి తన కొత్తింట్లో అతిధులకు స్పెషల్ గా పార్టీ ఇవ్వడమే కాదు.. డ్రింక్స్ కూడా స్వయంగా చిరునే సర్వ్ చేసాడు అంటే... చిరు అతిధులను ఏ రేంజ్ లో చూసుకున్నాడో తెలుస్తుంది. గత తొమ్మిదేళ్లుగా రకరకాల వెన్యూస్ లో జరిగిన పార్టీ ఈ 10 ఇయర్స్ సెలెబ్రేషన్స్ మాత్రం చిరు ఇంట్లోనే గ్రాండ్ గా జరగడం దానికి నాగ్, వెంకీ, మోహన్ లాల్, సురేష్, నరేష్ వంటి స్టార్స్ హాజరవడం జరిగింది.

అయితే ప్రతి ఏడాది సందడి చేసే రజినీకాంత్, కమల్ హాసన్, బాలకృష్ణ, మోహన్ బాబు లాంటి సీనియర్ దిగ్గజాలు ఈసారి ఈ పార్టీలో కనబడకపోవడం ఈ పార్టీకి కాస్త వెలితిగానే కనిపించింది. మరి బాలయ్య రూలర్ సినిమాతోనూ, లోకనాయకుడు కమల్ భారతీయుడు 2 తోనూ, రజిని దర్బార్ సినిమాలోనూ బిజీగా వున్నప్పటికీ... ఈ వేడుకకి మిస్ కాకుండా ఉంటే బావుండేదని ఫ్యాన్స్ అంటున్నారు. బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్ లో చిరు, నాగ్, వెంకీ, జయసుధ, రాధికా లాంటి వాళ్లంతా భీభత్సంగా ఎంజాయ్ చేసారని బయటికొచ్చిన ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. 

Class of Eighties Event : They are Missed:

80’s Celebrities Get together Party at Chiru House:

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ