త్రివిక్రమ్ డైరెక్షన్, అల్లు అర్జున్ క్రేజ్ మాత్రమే కాదు.. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి థమన్ ఇచ్చిన సాంగ్స్ ఇప్పుడు మార్కెట్ లో పిచ్చేక్కిన్చే క్రేజ్‌తో దూసుకుపోతున్నాయి. ఎక్కడ విన్నా, ఎవరి ఫోన్ రింగ్ టోన్ చూసినా.. ‘అల వైకుంఠపురములో’ సాంగ్స్ రచ్చే. అయితే సంక్రాంతికి విడుదల కాబోతున్న మరో సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సైలెంట్ ప్రమోషన్స్ చేసినా.. నిన్నటివరకు ‘అల వైకుంఠపురములో’ ముందు తేలిపోయింది. కానీ మహేష్ మ్యానియా, మహేష్ క్రేజ్ ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ కటింగ్‌తో ‘అల వైకుంఠపురములో’కు ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్‌ని బీట్ చేసే స్థాయికి చేరింది.
అల్లు అర్జున్ మ్యానియాతో ఇప్పటి వరకు హడావుడి జరిగినా.. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ టైంలోనే అల్లు అర్జున్ పనిగట్టుకుని ఓ మై డాడీ ఫుల్ సాంగ్‌ని వదలడం కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చింది. మహేషా.. అల్లు అర్జునా అంటూ సోషల్ మీడియాలో ఫైటింగ్ జరిగినా.. మహేష్ టీజర్ ముందు అల్లు అర్జున్ సాంగ్ తేలిపోయింది. సామజవరగమనా, రాములో రాములా పాటలు యూట్యూబ్‌లో రికార్డుల పరంగా సంచలనాలకు తెరలేపగా... ఓమై డాడీ సాంగ్ మాత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ క్రేజ్‌లో నిలబడలేకపోయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ 40 గంటల్లోనే 20 మిలియన్ రియల్‌టైమ్ వ్యూస్ సాధించి 40 గంటల పాటు కంటిన్యూగా యూట్యూబ్‌లో నెం1 స్థానంలో ట్రెండింగ్ అవడంతో.. ‘అల వైకుంఠపురములో’ సాంగ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.
సో.. ఈ విధంగా చూస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌కి పోటీగా ‘అల..’లోని సాంగ్‌ని అల్లు అర్జున్ రాంగ్ టైమ్‌లో వదిలాడనిపించింది. మెగా ఫ్యాన్స్ ఇప్పటివరకు మహేష్ ఫ్యాన్స్‌ని గడగడలాడిస్తే.. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్‌తో ఆడుకునేలా చేసిందా సాంగ్, టైమింగ్. ఒకవైపు ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ వ్యూస్ పరంగా దూసుకుపోతుంటే.. ‘అల వైకుంఠపురములో’ సాంగ్ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఇప్పటివరకు ఉత్సాహంతో ఉన్న మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఒక్కసారిగా నిరుత్సాహంలో పడిపోయారు.