టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువైందా? అంటే అవుననే అంటున్నాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు. ఆలీతో జాలీగా ప్రోగ్రాంకి వచ్చిన చోటా కె నాయుడు తన పర్సనల్ విషయాలతో పాటుగా... టాలీవుడ్ హీరోలపై సంచలన కామెంట్స్ చేసాడు. ఆలీతో జాలీగా ప్రోమోలో చోటా.. హీరోలపై చేసిన ఈ కామెంట్స్ హాట్ హాట్ గా ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. ప్రస్తుతం తెలుగులో సినిమాటోగ్రాఫర్స్ ఖాళీగా ఉన్నారని చెబుతున్నాడు. ఆలీ... కొత్త సినిమాటోగ్రాఫర్స్‌కి అవకాశాలివ్వాల్సి వచ్చి మీరెప్పుడైనా తప్పుకున్నారా అని చోటాని అడగ్గానే అసలు టాలీవుడ్ సినిమా కెమెరామెన్స్‌కి పనే లేదని, టాలీవుడ్ హీరోలు ఎలా చెబితే అలానే ఇండస్ట్రీ నడుస్తుంది అంటూ సంచలన కామెంట్స్ చేసాడు.
టాలీవుడ్ హీరోల మ్యానియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉందని, హీరోల డామినేషన్ ఎక్కువైంది అంటూ సంచలనంగా మాట్లాడాడు చోటా కె నాయుడు. గతంలో హీరోయిన్స్ కి ముద్దు పెట్టాడని చోటా కె నాయుడు మీద ట్రోలింగ్ నడిచింది. ఇక తాజాగా హీరోల మీద చోటా చేసిన ఈ వ్యాఖ్యల దుమారం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. అలాగే ఆలీతో జాలీగాలో చోటా పాల్గొన్న ప్రోగ్రాం ఫుల్ ఎపిసోడ్ ఈ సోమవారం ఈటీవీలో ప్రసారం కానుంది. మరి ప్రోమోతోనే కాక రేపిన ఈ ‘ఆలీతో జాలీగా’ ప్రోగ్రాం.. ఫుల్ ఎపిసోడ్‌తో మరెంత కాక రేపుతుందో చూడాలి.