Advertisementt

‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ టాకేంటి?

Sun 24th Nov 2019 06:43 PM
arjun reddy,tamil remake,adithya varma,talk,box office result  ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ టాకేంటి?
Arjun Reddy Tamil Remake Adithya Varma Talk ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ టాకేంటి?
Advertisement

తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ యూత్‌కి పిచ్చగా ఎక్కేసిన సినిమా. ఆ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అదే సినిమాని అర్జున్ రెడ్డి దర్శకుడే హిందీలో కబీర్ సింగ్ అంటూ షాహిద్ కపూర్‌తో రీమేక్ చేసాడు. ఆ సినిమా కూడా హిందీలో సెన్సేషనల్ హిట్ అయ్యింది. తెలుగు, హిందీ యూత్‌ని ఊపేసిన అర్జున్ రెడ్డిని తమిళనాట విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా పరిచయం అవడంతోనే రీమేక్ చేసాడు. ఒకసారి ఆదిత్య వర్మ సినిమా రీమేక్ బాల డైరెక్షన్ లో చెయ్యడం అది కాస్త.. నచ్చక విక్రమ్ మళ్ళీ గిరీశం అనే దర్శకుడికి ఆదిత్య వర్మని అప్పజెప్పడం.. ఇప్పుడా రీమేక్ విడుదల కావడం జరిగాయి. అయితే అర్జున్ రెడ్డిని యాజిటీజ్‌గా ఆదిత్య వర్మగా రీమేక్ చేసాడు దర్శకుడు. చిన్న చిన్న మార్పులు తప్పితే. పెద్దగా కొత్తదనం ఏం లేదు ఆ సినిమాలో.

అయితే ఆదిత్య వర్మలో మాత్రం హీరోయిన్ పాత్రకి న్యాయం చేశారనే చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాలో షాలిని పాండే.. విజయ్ దేవరకొండ ఏం చెబితే అది చెయ్యడం, ఆకారణంగానే విజయ్‌తో ప్రేమలో పడడం జరుగుతుంది. కానీ ఆదిత్య వర్మలో మాత్రం హీరోయిన్ ఆదిత్య వర్మని ఇష్టంగా ప్రేమిస్తుంది. ఇక అర్జున్ రెడ్డిలా విజయ్ దేవరకొండ, కబీర్ సింగ్ గా షాహిద్ కపూర్ అంత కాకపోయినా... మొదటిసారి స్క్రీన్ మీదకొచ్చిన ధృవ్ కూడా పర్వాలేదనిపించాడు. మరి ఆదిత్య వర్మ ధృవ్ కి మంచి హిట్ ఇచ్చిందనే చెప్పాలి. హీరోగా పరిచయమవడమే ధృవ్ సూపర్ హిట్ కాకపోయినా.. ఓ మంచి సినిమా చేసాడనిపించుకున్నాడు. 

Arjun Reddy Tamil Remake Adithya Varma Talk:

Arjun Reddy Tamil Remake Adithya Varma Released

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement