Advertisementt

రష్మిక లుక్.. దేవిశ్రీ మ్యూజిక్.. స్పేస్ లేదా?

Sun 24th Nov 2019 06:26 PM
rashmika,look,dsp,music,missed,sarileru neekevvaru,teaser  రష్మిక లుక్.. దేవిశ్రీ మ్యూజిక్.. స్పేస్ లేదా?
No Rashmika in Sarileru Neekevvaru Teaser రష్మిక లుక్.. దేవిశ్రీ మ్యూజిక్.. స్పేస్ లేదా?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు టీజర్ తో దుమ్ములేపారు. మ్యూజిక్ లేదు పాటలు లేవు అంటున్న మహేష్ అభిమనులకి సరిలేరు టీజర్ తో ఫుల్ మీల్స్ పెట్టారు. సరిలేరు టీజర్ లో మహేష్ లుక్ కానివ్వండి, యాక్షన్ సీన్స్ కానివ్వండి, ప్రకాష్ రాజ్, విజయశాంతిల లుక్స్ కానివ్వండి అన్ని హైలెట్ గా నిలిచాయి. అలాగే కామెడీతో కూడిన మహేష్ వార్ణింగ్స్, మహేష్ బాబు ఆర్మీ లుక్ అన్ని సూపర్ అనేలా ఉన్నాయి. కామెడీ డైరెక్టర్ ఈ రేంజ్ యాక్షన్ మూవీని చూపించడం మాత్రం కొత్తగా ఉంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా నటిస్తున్న పొట్టిపిల్ల రష్మిక లుక్ మాత్రం రివీల్ చెయ్యలేదు.

దీపావళి పండక్కి చందమామలా రష్మికని ఇలా మెరిపించిన అనిల్ రావిపూడి... ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు టీజర్ లో మాత్రమే ఆమెని అస్సలు రివీల్ చెయ్యలేదు. మరి రష్మికని కావాలనే  హైప్ చేస్తున్నారో... లేదంటే టీజర్లో రష్మికకి స్పేస్ లేదో కానీ.. రష్మిక మాత్రం బయటికి రాలేదు. మరి ఇప్పటివరకు అందంతో... అభినయంతో మెప్పిస్తున్న రష్మిక, మహేష్ కి జోడిగా ఎలాఉండబోతుందో అనేది అస్సలు అర్ధం కావడం లేదు. మరో పక్క దేవిశ్రీ మ్యూజిక్ బిట్ కూడా బయటికి రాలేదు. కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ తప్ప సరిలేరు పాటలెలా ఉండబోతున్నాయి అనే హింట్ కూడా ఇవ్వలేదు మూవీ టీం. మరి రష్మిక లుక్ కోసం, దేవిశ్రీ మ్యూజిక్ కోసం ఇంకెంత కాలం ఆగాలో చూద్దాం. 

No Rashmika in Sarileru Neekevvaru Teaser:

Rashmika look, DSP Music Missed in Sarileru Neekevvaru Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ