ఈ ఆదివారం నవీన్ పొలిశెట్టి డబుల్ ధమాకా !!
ఇటు తెలుగులో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాక.. ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకొన్న నవీన్ పొలిశెట్టి. హిందీలోనూ ‘చిచోరే’తో 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన బ్లాక్ బస్టర్ లో కీలకపాత్ర పోషించాడు.
ఈ రెండు సినిమాల వరల్డ్ వైడ్ టీవీ ప్రీమియర్స్ ఈ ఆదివారం ప్రసారం కానున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12.00 గంటలకు స్టార్ గోల్డ్ లో ‘చిచోరే’ ప్రసారం కానుండగా.. ఫెంటాస్టిక్ కామిక్ స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ జెమిని టీవీలో సాయంత్రం ప్రైమ్ టైం అయిన 6.00 గంటలకు ప్రసారం కానుంది.
నటుడిగా నవీన్ పోలిశెట్టి ప్రదర్శించిన వైవిధ్యాన్ని వెండితెరపై చూసి అచ్చెరువుగొన్న ప్రేక్షకులు.. ఇప్పుడు మరోమారు బుల్లితెరపై కూడా ఆ ఎంటర్ టైన్మెంట్ ను ఆస్వాదించండి.