Advertisementt

‘అప్పుడు-ఇప్పుడు’ నుంచి మరో సాంగ్..

Sun 24th Nov 2019 11:43 AM
hero srikanth,appudu ippudu,movie,song,released  ‘అప్పుడు-ఇప్పుడు’ నుంచి మరో సాంగ్..
Srikanth Launches Appudu Ippudu Movie Song ‘అప్పుడు-ఇప్పుడు’ నుంచి మరో సాంగ్..
Advertisement
Ads by CJ

హీరో శ్రీకాంత్  చేతుల మీదుగా ‘అప్పుడు-ఇప్పుడు’ సాంగ్ లాంచ్!!

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అప్పుడు-ఇప్పుడు’.  శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య  ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. కళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ చేతుల‌మీదుగా విడుదలైన మొదటి గీతానికి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైన పాట, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతులమీదుగా విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రంలోని మరో పాటని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా..

దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ - ‘‘ఇప్పటికే విడుదలైన పాటలకి, టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మరో గీతాన్ని హీరో శ్రీకాంత్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా యూనిట్ అందరి తరుపున ఆయనకు ధన్యవాదాలు. ఒక  ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్. హీరో హీరోయిన్లు పూర్తి సహకారం అందించారు. మేకింగ్ లో ఎక్కడా రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్  భరద్వాజ్ సంగీతం మా  సినిమాకు మంచి అసెట్. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ... ‘‘పూరి జగన్నాథ్ గారి చేతులమీదుగా విడుదలైన టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో ట్రేడ్ వర్గాల్లో మా సినిమా మీద బజ్ పెరిగింది. ఇప్పటికే విడుదలైన పాటలతో పాటు హీరో శ్రీకాంత్ గారి చేతులమీదుగా విడుదలైన ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాము. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.

సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి ...

సినిమాటోగ్రఫీ : కల్యాణ్ సమి 

ఆర్ట్: ఠాగూర్

లిరిక్స్: చిరావూరి విజయకుమార్

ఎడిటింగ్: వి.వి.ఎన్.వి.సురేష్ 

సంగీతం: పద్మానావ్ భరద్వాజ్

నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు 

దర్శకత్వం: చలపతి పువ్వల.

Srikanth Launches Appudu Ippudu Movie Song:

Appudu Ippudu Movie One More Song Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ