Advertisementt

మంచు విష్ణు ‘మోస‌గాళ్లు’ ఫ‌స్ట్‌లుక్ వదిలారు

Sat 23rd Nov 2019 08:51 PM
manchu vishnu,birthday,special,mosagallu,movie,first look  మంచు విష్ణు ‘మోస‌గాళ్లు’ ఫ‌స్ట్‌లుక్ వదిలారు
Manchu Mosagallu Movie First Look Released మంచు విష్ణు ‘మోస‌గాళ్లు’ ఫ‌స్ట్‌లుక్ వదిలారు
Advertisement
Ads by CJ

మంచు విష్ణు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా హాలీవుడ్ క్రాస్ ఓవ‌ర్ మూవీ ‘మోస‌గాళ్లు’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

శ‌నివారం మంచు విష్ణు పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న హాలీవుడ్ క్రాస్ ఓవ‌ర్ మూవీకి ‘మోస‌గాళ్లు’ అనే టైటిల్ ఖ‌రారు చేసి సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఇందులో మంచు విష్ణు అర్జున్ అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఫ‌స్ట్‌ లుక్‌లో మంచు విష్ణు డిఫ‌రెంట్‌గా అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు. ఐటీ రంగంలో జ‌రిగిన ప్ర‌పంచ అతి పెద్ద స్కామ్ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సినిమా నిర్మిత‌మ‌వుతోంది.

జెఫ్రీ గి చిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, రుహానీ సింగ్ స‌హా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విరానికా మంచు నిర్మాత‌. థ్రిల్ల‌ర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్ప‌టికే హైద‌రాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తొలి షెడ్యూల్‌లో మంచు విష్ణు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.  2020 వేస‌విలో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Manchu Mosagallu Movie First Look Released:

Manchu Vishnu Birthday Special: Mosagallu Movie First Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ