Advertisementt

‘M3’ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ వదిలారు

Sat 23rd Nov 2019 06:27 PM
m3 movie,motion poster,first look,released  ‘M3’ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ వదిలారు
M3 Movie First Look Released ‘M3’ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ వదిలారు
Advertisement
Ads by CJ

‘ఎం 3’  మూవీ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల!!

టాలీబీట్స్‌ మీడియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య హీరోహీరోయిన్లుగా రామకృష్ణ తోట స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఎం 3’. (మ్యాన్‌ మ్యాడ్‌ మనీ అనేది క్యాప్షన్‌). ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని చిత్ర యూనిట్‌ ఈరోజు (నవంబర్‌ 22న) విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు రామకృష్ణ తోట మాట్లాడుతూ - ‘‘మా చిత్రం మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయడం చాలా హ్యాపీగా ఉంది.   సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో ఈ చిత్రం రూపొందింది.  తెలుగు ప్రేక్షకులు కంటెంట్‌ బేస్డ్‌ మూవీస్‌ని ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ‘ఎం 3’ చిత్రం కూడా ఆ కోవలోనే ఉంటుంది. సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య చాలా బాగా నటించారు. అలాగే మిగితా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ సినిమా బాగా రావడానికి ఎంతగానో సహకరించారు.  అలాగే ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతాన్ని అందించిన సునీల్‌ కశ్యప్‌ మా సినిమాకి సంగీతం అందించడం సంతోషంగా ఉంది. కల్యాణ్‌ సమి బ్యూటిఫుల్‌ విజువల్స్‌, వెంకట ప్రభు ఎడిటింగ్‌, రాజ్‌కుమార్‌ ఆర్ట్‌ వర్క్‌, శంకర్‌ స్టంట్స్‌ సినిమాకి ప్లస్‌ అవుతాయి. ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్‌ అంశాలు ఇందులో ఉన్నాయి’’ అన్నారు.

సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య, రాజశేఖర్‌, యోగి, జయభారత్‌ రెడ్డి, దినేష్‌, రామకృష్ణ తోట, జయచంద్ర, లక్ష్మణ్‌, పగడాల ప్రసాద్‌, కెఎస్‌ మూర్తి, త్రిమూర్తి, సునీత మనోహర్‌, చందన, మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: కల్యాణ్‌ సమి, ఎడిటింగ్‌: డి. వెంకట ప్రభు, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, ఆర్ట్‌: రాజ్‌కుమార్‌, స్టంట్స్‌: శంకర్‌, కొరియోగ్రఫీ: శామ్యూల్‌, జోసెఫ్‌ ప్రకాష్‌, పి.ఆర్.ఓ : సాయి సతీష్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరత్ కొండూరు, రచన,నిర్మాత, దర్శకత్వం: రామకృష్ణ తోట.

M3 Movie First Look Released:

M3 Movie Motion Poster Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ