నయనతార ప్రమోషన్స్‌కి రావడం లేదు... సినిమాల్లో ఎంత క్రేజుంటే మాత్రం.. అందరికన్నా ఎక్కువ పారితోషకం తీసుకుని.. పబ్లిసిటీ చెయ్యకపోతే ఎలా అంటూ టాలీవుడ్ దర్శకనిర్మాతలు నయనతారని పక్కనబెట్టారనే టాక్ వినబడింది. ఇక టాలీవుడ్‌లాగే కోలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా నయనతార క్రేజుకి బ్రేకులు వేసే ఆలోచనలోఉన్నారని అన్నారు. మరి దర్శకనిర్మాతలు నయనతారకి షాకిద్దామని ప్రిపేర్ అవుతుంటే.. నయనతారే వారికీ షాకిచ్చేలా ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో క్రేజున్న హీరోయిన్‌గా నటిస్తున్న నయనతార ఇప్పటివరకు 6 కోట్ల పారితోషకం అందుకుంది అన్నారు.
కానీ తాజాగా తన క్రేజ్‌ని క్యాష్ చేసుకునే పనిలో నయనతార ఉందని... తన పారితోషకాన్ని రెండు కోట్లు పెంచేసిందనే టాక్ కోలీవుడ్‌ని షేక్ చేస్తుంది. నయనతార తాను ఒప్పుకోబోయే ప్రాజెక్టులకు 7 నుండి 8 కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. గత రెండున్నరేళ్లుగా నయనతార నటిస్తున్న సినిమాలకు కాసుల వర్షం కురుస్తున్న కారణంతోనే... నయనతార ఇలా డిమాండ్ చెయ్యడానికి రెడీ అయ్యిందంటున్నారు. వయసు పెరిగే కొద్దీ క్రేజ్ పెంచుకుంటున్న ఈ తార కథను బట్టి, తన పాత్రని బట్టి అధిక రెమ్యునరేషన్ పెంచిందని టాక్ వినబడుతుంది. మరి దర్శకనిర్మాతలు నయనతార క్రేజ్‌కి అడ్డుకట్ట వేద్దామనుకుంటే.. ఇప్పుడు వాళ్ళకే నయన్ దిమ్మతిరిగే షాకిచ్చింది అంటూ సోషల్ మీడియాలో నయన్ అభిమానులు డబ్బా కొట్టుకుంటున్నారు.