అటు ఈ టీవీ.. ఇటు మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్స్‌కు ‘జబర్దస్త్’ కతర్నాక్ కామెడీ షో ఊపిరిలాంటిది!. ఒక్క మాటలో చెప్పాలంటే జబర్దస్త్ వల్లే మల్లెమాల బతికి బట్టకడుతోందని కూడా కొందరు పెద్దలు చెబుతుంటారు. ఈ షో ఎంత మందికి లైఫ్ ఇచ్చిందో.. ఎంతమందిని ఉన్నతస్థాయికి చేర్చిందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే ఈ మధ్య కొన్ని చానెల్స్ కొత్త కొత్త షోలు పెట్టడం.. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు సిబ్బందిని లాగేసుకోవడం జరిగింది. దీంతో ఎవరెప్పుడు ఏ యాజమాన్యం కింద ఉంటారో..? ఎప్పుడు జంపింగ్స్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇప్పటికీ ఈ షో నుంచి జడ్జ్‌గా వ్యవహరిస్తున్న నాగబాబు వేరే చానల్‌కు షిఫ్ట్ అయిన విషయం విదితమే. అయితే అదే బాటలో హాట్ యాంకర్ అనసూయ కూడా నడిచిందని టాక్. నాగబాబుతో పాటు మరో జడ్జిగా అనసూయ కనిపించే అవకాశాలు వున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. అంటే యాంకర్ నుంచి అనసూయకు జడ్జిగా ప్రమోషన్ వచ్చిందన్న మాట. గత వారం రోజులుగా నాగబాబు, రోజా స్థానంలో జడ్జిలుగా ఎవరు రాబోతున్నారు..? అనసూయ స్థానం ఎవరికి..? రష్మీ సంగతేంటి..? అని ఇలా ప్రశ్నలు వస్తున్నాయ్.. అంతేకాదు నెట్టింట్లో.. వెబ్‌సైట్లలో పెద్ద ఎత్తున పుకార్లు కూడా వస్తున్నాయ్. వీటన్నింటికీ సమాధానం మాత్రం ఎవరూ.. ఎక్కడా చెప్పట్లేదు. అయితే తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది.
అయితే ఇలా ఒక్కొక్కరుగా జంపింగ్‌లు చేస్తుండగా..‘షరతులు వర్తిస్తాయ్’ అంటూ కొన్ని కండిషన్లతో కొత్త ఆర్టిస్ట్‌లను యాంకర్లను, జడ్జిలను తీసుకునే పనిలో మల్లెమాల యాజమాన్యం బిజిబిజీగా ఉందట. ఈ క్రమంలో అనసూయ ప్లేస్‌లో శ్రీముఖి సందడి చేయనుందని సమాచారం. శ్రీముఖికి యాంకరింగ్ కొత్తేం కాదు.. ఇప్పటికే ‘పటాస్’ షోకు ఆమె వ్యాఖ్యతగా వ్యవహరించింది. బిగ్‌బాస్-3లో పాల్గొని తన రేంజ్ మరింత పెంచుకుంది. షో మారుతుందేమో కానీ అరుపులు మాత్రం కామనే.. అంటే ఇక పటాస్‌లోని అరుపులు ఈ బుల్లితెర రాములమ్మ జబర్దస్త్‌లో హంగామా చేయనుందన్న మాట. సో.. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.