Advertisementt

RRR: పట్టలేని ఆనందంలో ఎన్టీఆర్ బ్రిటీష్ బ్యూటీ

Thu 21st Nov 2019 08:20 PM
rrr,jr ntr,ss rajamouli,british beauty,olivia morris  RRR: పట్టలేని ఆనందంలో ఎన్టీఆర్ బ్రిటీష్ బ్యూటీ
NTR British Beauty Reacts On RRR Unit Welcome! RRR: పట్టలేని ఆనందంలో ఎన్టీఆర్ బ్రిటీష్ బ్యూటీ
Advertisement
Ads by CJ

బాహుబలి సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న. బహుబలికి ఏ మాత్రం తగ్గకుండా అంతకుమించి బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ చిత్రంలో స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారు. ఇప్పటికే సుమారు హాఫ్ సినిమాకు సంబంధించి షూటింగ్ అయిపోయింది. అయితే  సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని వివరాలను వెల్లడించిన చిత్రబృందం.. తాజాగా ఎన్టీఆర్ సరసన నటించిన బ్రిటీష్ బ్యూటీని జక్కన్న నిన్న పరిచయం చేసిన విషయం విదితమే. ఇదిగో ఈ ఫొటోలోని తెల్లపిల్లే ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయబోయేది అని ‘ఒలివియా మోరిస్’ను జూనియర్‌ ఫ్యాన్స్‌కు పరిచంయం చేశారు.

ఈ సందర్భంగా ఒలివీయాకు వెల్‌కమ్ చెప్పి..‘మీ రాక కోసం చిత్రబృందం వెయిటింగ్’ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు మరో ఇద్దరు నెగిటివ్ షేడ్స్‌ అయిన ‘స్కాట్’ పాత్ర కోసం ఐరిష్ నటుడు ‘రే స్టీవెన్సన్’, లేడీ విలన్, లేడీ స్కాట్ కోసం సీనియర్ నటి ‘ఆలిసన్ డూడి’ని ఎంపిక చేసుకున్నట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే తాజాగా చిత్రబృందం ఆహ్వానం, ‘RRR’లో నటిస్తుండటంపై ఎన్టీఆర్ హీరోయిన్ రియాక్ట్ అయ్యింది.

ఆనందంలో మునిగి తేలుతున్నా..!

‘ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ సినిమాలో నా పాత్ర పట్ల వస్తున్న స్పందన పట్ల నిజంగా ఆనందంలో మునిగితేలుతున్నాను. ఇంతటి గ్రాండ్ వెల్‌కమ్‌ పలుకుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని ట్విట్టర్ వేదికగా బ్రిటీష్ బ్యూటీ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ విప్లవ యోధుడు కొమరం భీమ్‌ పాత్రలో మెరవనున్నాడు. కాగా ఇప్పటి వరకూ దాదాపు 70% షూటింగ్ అయినప్పటికీ ఎన్టీఆర్, చెర్రీకి సంబంధించిన సింగిల్ లుక్ కూడా జక్కన్న రిలీజ్ చేయలేదు. మరి హీరోయిన్లను పరిచయం చేసిన రాజమౌళి.. హీరోల ఫస్ట్ లుక్‌లు ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎన్టీఆర్-చెర్రీ అభిమానులు, మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్.. జక్కన్న ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.

NTR British Beauty Reacts On RRR Unit Welcome!:

NTR British Beauty Reacts On RRR Unit Welcome!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ