Advertisementt

నయనతార ఇలా మళ్లీ వార్తల్లోకి..!

Thu 21st Nov 2019 07:30 PM
nayanthara,vegetarian,mookuthi amman,srirama rajyam,nayan  నయనతార ఇలా మళ్లీ వార్తల్లోకి..!
Once Again Nayanthara in News.. నయనతార ఇలా మళ్లీ వార్తల్లోకి..!
Advertisement
Ads by CJ

నయనతార హాట్ అండ్ సెక్సీ లుక్ లోనే అందరిని పడేస్తుంది. బికినీ వేసినా.. చీర కట్టినా నయన్ అందాలకు ఫిదా అవ్వాల్సిందే. అలాగే నయనతార పెదవిపై ఉన్న పుట్టుమచ్చ ఆవిడ సెక్సీ లుక్ కి మరింత అందాన్నిస్తుంది. అయితే ఎప్పుడూ గ్లామర్ పాత్రలు వేసే నయనతారకు శ్రీరామరాజ్యంలో సీత పాత్ర ఇచ్చినప్పుడు... సెక్సీ లుక్ ఉన్న నయన్ సీత పాత్రకి న్యాయం చెయ్యగలదా అంటూ దీర్ఘాలు తీశారు. కానీ నయనతారని సీత పాత్రలో చూసిన వారు.. సీత పాత్రకి నయన్ ని తప్ప మరెవర్నీ ఊహించుకోలేమన్నారు. అయితే సీత పాత్ర చేసినప్పుడు నయనతార నియమనిష్టలు పాటించి మాంసాహారానికి దూరంగా ఉంటూ సీత పాత్రకి వన్నె తెచ్చింది.

తాజాగా నయనతార మరో ఆధ్యాత్మిక చిత్రం కోసం మాంసాహారాన్ని త్యాగం చేసి... శాకాహారిగా మారిపోయిందనే న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. నయనతార ముకుత్తి అమ్మన్ అనే ఆధ్యాత్మిక చిత్రం కోసం నాన్ వెజ్ ని త్యాగం చేసి..... వెజిటేరియన్ గా మారడమే కాదు... ఒకపూట భోజనం చేస్తూ... చాలా నిష్టగా ఆ పాత్ర కోసం రెడీ అవుతుందట. మరి గ్లామర్ పాత్రకి గ్లామర్ గర్ల్ లా అదిరిపోయే నటన చూపించే నయనతార ఇలా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్దమంటుంది. మరి నయన్ ఏ పాత్ర వేసినా ఆ పాత్రకే వన్నె తెస్తుందన్నమాట. 

Once Again Nayanthara in News..:

Nayanthara turns vegetarian for Mookuthi Amman

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ