Advertisementt

RRR తాజా అప్డేట్: 10 భాషల్లో..!

Thu 21st Nov 2019 06:23 PM
rrr,rrr movie,ram charan,jr ntr,ss rajamouli,british actress olivia morris,alison doody,ray stevenson  RRR తాజా అప్డేట్: 10 భాషల్లో..!
RRR Movie Latest Update RRR తాజా అప్డేట్: 10 భాషల్లో..!
Advertisement
Ads by CJ

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న భారీ పీరియాడిక‌ల్ డ్రామా ‘RRR’ లేటెస్ట్ అప్ డేట్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ పీరియాడిక‌ల్ డ్రామా ‘RRR’. ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాలో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా భారీ బడ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్ర‌మిది. ఈ సినిమా ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. విప్ల‌వ యోధుడు కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఈ రెండు నిజ‌మైన‌ లెజెండ్రీ పాత్ర‌ల‌కు సంబంధించిన ఫిక్ష‌నల్ పీరియాడిక‌ల్ డ్రామా ఇది. బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్, ఆలియా భ‌ట్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

రామ్‌చ‌ర‌ణ్ జోడిగా ఆలియా భ‌ట్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించ‌బోయే హీరోయిన్‌ను చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది. ఎన్టీఆర్ స‌ర‌స‌న బ్రిటీష్ న‌టి ఒలివియా మోరిస్‌ న‌టించ‌నున్నారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే అలిసన్ డూడీ, రే స్టీవెన్ స‌న్ మెయిన్ విల‌న్స్‌గా న‌టిస్తున్నారు. ‘ఎ వ్యూ టు కిల్‌’, ‘ఇండియానా జోన్స్‌’, ‘లాస్ట్ క్రూసేడ్‌’ వంటి చిత్రాల్లో ఐరిష్ న‌టి అలిస‌న్ డూడీ న‌టించారు. అలాగే ‘థోర్‌’, ‘కింగ్ అర్థ‌ర్‌’ స‌హా ప‌లు పాపుల‌ర్ టీవీ షోస్‌లో రే స్టీవెన్ స‌న్ న‌టించారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి 2020లో.. 10 భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది.

RRR Movie Latest Update:

RRR is going to have a theatrical release in 10 Languages

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ