RRRలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. RRR మొదలైనప్పుడు.. కొమరం భీమ్‌గా చేస్తున్న ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ అంటూ ప్రకటించడం, ఆమె కొన్ని రోజులకి హ్యాండ్ ఇవ్వడంతో.. దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్ తో నటించే హీరోయిన్ విషయంలో చాలా టైం తీసుకుని... సినిమా షూటింగ్ మొదలైన ఏడాదికి ఎన్టీఆర్ హీరోయిన్‌ని సెట్ చేసాడు. ఇప్పటికే RRR షూటింగ్ 70 శాతం పూర్తయ్యిందని, ఎన్టీఆర్ హీరోయిన్ ని ప్రకటించబోతున్నామంటూ సోషల్ మీడియాలో హంగామా చేసిన RRR టీం.. చివరికి ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్‌ని ఫోటోతో సహా ప్రకటించింది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటించనుందని... ట్వీట్ చేసిన RRR టీం ఒలివియా మోరిస్‌కు స్వాగతం. మా సినిమాలో మీరు ప్రధాన పాత్ర అయిన ‘జెన్నిఫర్’ పాత్రను పోషిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. షూట్ కోసం ఎదురు చూస్తున్నాము అంటూ టీం ఒలివియా మోరిస్‌కు స్వాగతం పలికింది. మరి చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా.. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన అందమైన ఒలివియా మోరిస్ నటిస్తుంది. మరి ఎన్టీఆర్ పాత్రకి ఒలివియా మోరిస్ సరిగ్గా సరిపోతుందిలే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.