Advertisementt

RRR : ఎన్టీఆర్ హీరోయిన్.. విలన్స్ వివరాలివిగో..

Wed 20th Nov 2019 09:33 PM
ntr beautiful heroine,rrr villains,olivia jennifer,ray stevenson,alison doody  RRR : ఎన్టీఆర్ హీరోయిన్.. విలన్స్ వివరాలివిగో..
NTR’s Beautiful Heroine And RRR Villains RRR : ఎన్టీఆర్ హీరోయిన్.. విలన్స్ వివరాలివిగో..
Advertisement
Ads by CJ

బాహుబలి సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న. బహుబలికి ఏ మాత్రం తగ్గకుండా అంతకుమించి బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ చిత్రంలో స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారు. ఇప్పటికే సుమారు హాఫ్ సినిమాకు సంబంధించి షూటింగ్ అయిపోయింది. అయితే  సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని వివరాలను వెల్లడించిన చిత్రబృందం.. హీరోయిన్ విషయంలో మాత్రం కాస్త గజిబిజి అయ్యింది. ముందుగా ఎన్టీఆర్, చెర్రీకి ఇద్దరి సరసన నటించే నటీమణులను సెలెక్ట్ చేసుకోవడం.. ఆ తర్వాత జూనియర్ సరసన నటించే హీరోయిన్ హ్యాండివ్వడంతో కాస్త షూటింగ్ ఆలస్యమైంది. అయితే నాటి నుంచి హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టిన జక్కన్న ఎట్టకేలకు బ్రిటీష్ బ్యూటీని పట్టేశాడు.

ఇదిగో పక్క ఫొటోలో చూస్తున్న ఈ తెల్ల తోలు పిల్లే ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయబోయేది. ఈ బ్యూటీ పేరు ‘ఒలివియా మోరిస్’. ఒక్కరోజు ముందుగా చెప్పినట్లుగానే చిత్రబృందం ఎన్టీఆర్ హీరోయిన్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఒలివియాకు చిత్రబృందం వెల్‌కమ్ చెప్పి.. మీ రాక కోసం చిత్రబృందం వెయిటింగ్ అంటూ ట్వీట్ చేసింది. కాగా.. ఇన్ని రోజులుగా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూసే అని చెప్పుకోవచ్చు.  నటించనుందని ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో నటించబోయే మరో ఇద్దరి కీలక పాత్రలను చిత్రబృందం వెల్లడించింది. వారిద్దరూ కూడా నెగిటివ్ షేడ్స్‌లో నటించనున్నారు. ‘స్కాట్’ పాత్ర కోసం ఐరిష్ నటుడు ‘రే స్టీవెన్సన్’.. లేడీ విలన్, లేడీ స్కాట్ కోసం సీనియర్ నటి ‘ఆలిసన్ డూడి’ని ఎంపిక చేసుకున్నట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది. సో.. మొత్తానికి చూస్తే ఇవాళ ఒక్కరోజే జక్కన డబుల్ సర్‌ఫ్రైజ్ ఇచ్చేశారన్న మాట. ఈ నటీనటులు అయినా మధ్యలో హ్యాండ్ ఇవ్వకుండా షూటింగ్ పూర్తి చేసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే మరి.

NTR’s Beautiful Heroine And RRR Villains:

NTR’s Beautiful Heroine And RRR Villains

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ