సౌత్ హీరోయిన్స్ ఇక్కడ ఎంత పెద్ద స్టార్ హీరోయిన్స్ అయినా సరే ఎపుడూ వారి చూపు బాలీవుడ్ మీదే ఉంటుంది. అక్కడ సినిమాలు చేస్తూ.. సెటిల్ అవ్వాలని వారి కోరిక. అందుకే ఇక్కడ ట్రెడిషనల్ గా నటించినా.. అక్కడ గ్లామర్ తో టాప్ లేపుతారు. నయనతార, సమంత వంటి వాళ్ళు బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడకపోయినా... కాజల్, రకుల్ లాంటి వాళ్ళు మాత్రం బాలీవుడ్ టార్గెట్ గా అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఇపుడు ఓ బాలీవుడ్ ప్లాప్ సినిమా కోసం టాలీవుడ్ హిట్ సినిమా మిస్ చేసుకున్నానంటూ.. ఓ ఆసక్తికర సంఘటనను బయటపెట్టింది. అది తెలుగులో ‘లో బడ్జెట్’లో తెరకెక్కి అదిరిపోయే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తెచ్చిన విజయ్ - రశ్మికల ‘గీత గోవిందం’లో ముందు రకుల్‌కే ఛాన్స్ వచ్చిందట.
విజయ్ దేవరకొండ సరసన రకుల్ కి ఛాన్స్ వస్తే రకుల్ ‘నో’ చెప్పగా ఆ అదృష్టం రశ్మికాని వరించింది. మరి ‘గీత గోవిందం’తో రశ్మిక స్టార్ హీరోయిన్ అయ్యింది. ఆ సినిమా కూడా హిట్. అయితే రకుల్ ‘గీత గోవిందం’ కాదనడానికి బాలీవుడ్‌లో ‘దే దే ప్యార్ దే’ సినిమా కారణం అంటుంది. తాను బాలీవుడ్‌లో ‘దే దే ప్యార్ దే’ సినిమాకి సైన్ చెయ్యడం వలన ‘గీత గోవిందం’కి డేట్స్ అడ్జెస్ట్ కాక.. విజయ్ దేవరకొండ పక్కన ఛాన్స్ మిస్ చేసుకున్నానంటోంది. మరి బాలీవుడ్‌లో ‘దే దే ప్యార్ దే’ పెద్ద హిట్ అవలేదు. ఇక ‘గీత గోవిందం’ మిస్ అయినందుకు బాధలేదంటున్న రకుల్.. ఓ మంచి సినిమాలో అది విజయ్ పక్కన నటించలేకపోయినందుకు బాధపడుతుందట.